Priyanka Upendra's Capture movie 2023: తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన కన్నడ కథానాయకుడు ఉపేంద్ర భార్య, కన్నడలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక. ఇప్పుడు ఆమె తెలుగు మార్కెట్ మీద కాన్సంట్రేట్ చేశారు. ఆమె 50వ సినిమా 'డిటెక్టివ్ తీక్షణ' సినిమాను తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పుడు మరో సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి రెడీ అవుతున్నారు.
ప్రియాంక ప్రధాన పాత్రలో 'క్యాప్చర్'
ప్రియాంకా ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక సినిమా 'క్యాప్చర్'. షమికా ఎంటర్‌ప్రైజెస్, శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ సంస్థలపై రవి రాజ్ నిర్మిస్తున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే... మరొక కథానాయిక రాధికా కుమారస్వామి సమర్పణలో రూపొందుతున్న చిత్రమిది.
దర్శకుడితో ప్రియాంక హ్యాట్రిక్!
'క్యాప్చర్' సినిమాకు లోహిత్ .హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో కొత్త తరహా కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు తీస్తారని ఆయనకు పేరు ఉంది. ప్రియాంకా ఉపేంద్ర ప్రధాన తారగా ఆయన దర్శకత్వం వహిస్తున్న మూడో చిత్రమిది. వాళ్ళిద్దరి కాంబోలో ఇంతకు ముందు 'మమ్మీ', 'దేవకి' చిత్రాలు వచ్చాయి. 'క్యాప్చర్'తో హ్యాట్రిక్ అందుకోవాలని రెడీ అవుతున్నారు.
సింగిల్ లెన్స్... సిసి ఫుటేజ్!
'క్యాప్చర్' ఫస్ట్ లుక్ చూస్తే... ప్రియాంకా ఉపేంద్ర భయపెట్టేలా ఉన్నారు. ఆమె ముఖం మీద రక్తం ఉంది. చుట్టూ కెమెరాలు ఉన్నాయి. వాటిపై ఓ కాకి కూడా ఉంది. లుక్ వెనుక థీమ్ ఏంటనేది ట్రైలర్ విడుదల అయితే గానీ తెలియదు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే...
Also Read : టైగర్ 3 రివ్యూ : దీపావళికి సల్మాన్ యాక్షన్ ధమాకా సౌండ్ చేస్తుందా? సినిమా హిట్టా? ఫట్టా?
సినిమా అంతటినీ సింగిల్ లెన్స్ ఫార్మటులో షూటింగ్ చేశారట. సిల్వర్ స్క్రీన్ మీద సీసీ టీవీ ఫుటేజ్ ప్రజెంట్ చేసినట్లు ఉంటుందట. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా ఇదేనని చిత్ర బృందం చెబుతోంది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవి రాజ్ మాట్లాడుతూ ''గోవాలో 'క్యాప్చర్' షూటింగ్ అంతా చేశాం. నాన్ స్టాప్ షెడ్యూల్ లో సినిమా ఫినిష్ చేశాం. 30 రోజుల పాటు నిరవధికంగా జరిగిన చిత్రీకరణలో సినిమా అంతా పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి'' అని చెప్పారు.
Also Read : మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?
శివ రాజ్ కుమార్ 'తగరు' సినిమాతో కన్నడ ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న మన్విత కామత్ 'క్యాప్చర్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మాస్టర్ కనిష్ రాజ్ బాల నటుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : పాండి కుమార్, కూర్పు : రవిచంద్రన్.