Bunny Vas's Reaction On Controversial Issues: సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (Bunny Vas). తాజాగా ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'ఓ విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది. దీంతో పాటే ఇప్పుడు ఎందుకీ గొడవలు అని కూడా ఉంది. శాంతి.. శాంతి.. శాంతి..!' అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఆయన దేనిపై తన అసహనాన్ని వెళ్లగక్కారో అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
బన్నీ వాస్ ఏ అంశంపై ఈ కామెంట్స్ చేశారో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఇటీవల '#సింగిల్' (#Single) ట్రైలర్‌లో కొన్ని డైలాగ్స్ వివాదానికి దారి తీయగా.. దీనిపైనే ఆయన పోస్ట్ పెట్టారని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: 'రెట్రో' ట్విట్టర్ రివ్యూ - సూర్య ఖాతాలో మరో హిట్ పడిందా.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
అసలు ఏంటీ ఆ వివాదం..
యంగ్ హీరో శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ '#సింగిల్' (#Single) ట్రైలర్ సోమవారం రిలీజ్ అయ్యింది. కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కగా.. శ్రీవిష్ణు (Sree Vishnu), వెన్నెల కిశోర్ (Vennela Kishore) కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో ట్రైలర్‌లో నవ్వులు పూయించారు. అయితే, కొన్ని డైలాగ్స్ వివాదానికి దారి తీశాయి. ట్రైలర్‌లో శ్రీ విష్ణు 'శివయ్యా..' అంటూ వెటకారం చేసేలా అరవడం.. ట్రైలర్ చివర్లో 'మంచు కురిసిపోతుందని' అంటూ డైలాగ్ చెప్పడం పెద్ద చర్చకు దారితీసింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో కూడా 'శివయ్యా..' అనే డైలాగ్ ఉంది. దీని భక్తి పారవశ్యంలో ఎమోషన్‌తో చెప్పగా దాన్ని వెటకారం చేసేలా '#సింగిల్'లో అదే డైలాగ్ చెప్పడం విమర్శలకు దారి తీసింది.
సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దీనిపై కామెంట్స్ చేశారు. మరోవైపు, మంచు విష్ణు సైతం దీనిపై అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఓ దశలో వీటిపై డైరెక్టర్స్ అసోసియేషన్‌లోనూ కంప్లైంట్ చేస్తారనే రూమర్స్ వినిపించాయి.
సారీ చెప్పిన శ్రీవిష్ణు
దీనిపై హీరో శ్రీవిష్ణు తాజాగా స్పందించారు. మంచు విష్ణు పేరును ప్రస్తావించనప్పటికీ.. 'కన్నప్ప' మూవీ టీం హర్ట్ అయిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం తమకు లేదని అందుకే 'శివయ్యా' డైలాగ్స్ సినిమా నుంచి తీసేశామని శ్రీ విష్ణు తెలిపారు. 'ఇటీవల విడుదలైన మా '#సింగిల్' ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌లో డైలాగ్స్‌పై కన్నప్ప టీం హర్ట్ అయినట్లు తెలిసింది. మేం ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదు. అది తప్పుగా అర్థమైంది. వెంటనే సంబంధిత సీన్స్ తొలగించాం.
సినిమా ఇండస్ట్రీలో తామంతా ఒకటే కుటుంబం. సినిమాలో చిరంజీవి, బాలకృష్ణతో పాటు అల్లు అరవింద్ సహా కొంత మంది చెప్పిన డైలాగులను సరదాగా ఉపయోగించాం. ప్రజెంట్ మీమ్స్, సోషల్ మీడియాల్లో వైరల్ అయిన డైలాగ్స్ కొన్ని సినిమాలో ఉన్నాయి. శివయ్యా డైలాగ్ సినిమాలో ఇక ఉండదు.' అని శ్రీవిష్ణు స్పష్టం చేశారు.