పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా 'బ్రో'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత.  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సముద్రఖని కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయ్యింది. 


శిల్పకళా వేదికలో 'బ్రో' ప్రీ రిలీజ్ ఫంక్షన్
Bro Movie Pre Release Event Date : జూలై 28న 'బ్రో' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదలకు మూడు రోజుల ముందు హైదరాబాద్, శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ సహా ఇతర చిత్ర బృందం హాజరు కానున్నారు.


Also Read : తమన్ ఆ పాటను కాపీ కొట్టారా? 'జాణవులే'పై ఫ్యాన్స్ ట్రోల్స్


'బ్రో'... రెండు పాటలు వచ్చాయ్
'బ్రో' నుంచి కొన్ని రోజులు 'మై డియర్ మార్కండేయ' సాంగ్ విడుదల చేశారు. ఈ సినిమాలో రెండో పాట... సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), కేతికా శర్మపై తెరకెక్కించిన 'జాణవులే'ను తాజాగా వచ్చింది. ఈ పాటలకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ స్పందన ఊహించామని సంగీత దర్శకుడు కొన్ని రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.


పవన్, సాయి తేజ్... గతంలో ఇద్దరితోనూ తమన్ పని చేశారు. ముఖ్యంగా పవన్ 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' సినిమాలకు తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది. దాంతో 'బ్రో' పాటలపై మీద అంచనాలు పెరిగాయి. కానీ, ఆ స్థాయిలో పాటలు లేవని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక, నేపథ్య సంగీతం మీద అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో మరో కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఉన్నారు. ఆమె పాత్ర ఏమిటనేది ఆసక్తికరం. 'మై డియర్ మార్కండేయ' పాటలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా స్టెప్పులు వేశారు.


Also Read ఆలీకి పవన్ కళ్యాణ్ ఝలక్ - స్నేహానికి పూర్తిగా తెగతెంపులు?



'బ్రో' సినిమాలో సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), నర్రా శ్రీను, యువ లక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ప్రధాన తారాగణం. ఇంకా ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఏ.ఎస్. ప్రకాష్, కూర్పు : నవీన్ నూలి, పోరాటాలు : సెల్వ, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్, సంగీతం :  ఎస్.ఎస్. థమన్,  సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల,  నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & జీ స్టూడియోస్, నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, కథనం & మాటలు : త్రివిక్రమ్ శ్రీనివాస్, రచన & దర్శకత్వం : పి. సముద్రఖని. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial