ట్రోల్స్, విమర్శలు సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman)కు కొత్త కాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయన బోలెడు విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల 'బ్రో' సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రోల్స్ గురించి ఆయన స్పందించారు.
''ట్రోల్స్ ముందు నుంచి ఎవరు అయితే చేస్తున్నారో, ఇప్పుడూ వాళ్ళే చేస్తున్నారు. ఈ రోజు కొత్తగా ఎవరూ రాలేదు'' అని తమన్ వ్యాఖ్యానించారు. 'బ్రో' సినిమాలో తొలి పాట 'మై డియర్ మార్కండేయ'పై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లగా... ''అది తేజ్ సాంగ్! అందులో పవన్ కళ్యాణ్ వస్తారు. ఆ సందర్భానికి అంతకు మించి కొట్టలేం'' అని తమన్ పేర్కొన్నారు. 'బ్రో' సినిమాలో పాటలకు ఎక్కువ స్కోప్ లేదన్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడు రెండో పాట 'జాణవులే...' వచ్చింది. దీనిపై కూడా విమర్శల జడివాన మొదలైంది.
మై డియర్ మార్కండేయ బెటర్!
'బ్రో'లో 'జాణవులే...' పాట కంటే 'మై డియర్ మార్కండేయ...' బెటర్ అని కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తేజ్ సినిమాల్లో మాత్రమే కాదని, తమన్ కెరీర్ చూసినా 'బ్రో' వరస్ట్ ఆల్బమ్ అని పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు ఈ విధంగా చేయడం ఏమిటని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నెటిజన్ అయితే ఇంట్రెస్ట్ లేకపోతే సినిమా చేయడం మానేయొచ్చు కదా, ఇలా చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు.
'జాణవులే...' పాటకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంత మంది శ్రోతలు ఫిమేల్ సింగర్ ప్రణతి వాయిస్ బావుందని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు విమర్శలు వ్యక్తం అయినప్పటికీ... సినిమా విడుదల సమయానికి పాటకు మంచి స్పందన వస్తుందని, స్క్రీన్ మీద చూసిన తర్వాత జనాలకు నచ్చుతుందని కొందరు చెబుతున్నారు. పాటల సంగతి పక్కన పెడితే... 'బ్రో' నేపథ్య సంగీతం ఎలా ఉంటుందో చూడాలి. తమన్ నేపథ్య సంగీతానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి సినిమాతో ఆయన అంచనాలు పెంచుకుంటూ వెళుతున్నారు. దాని వల్ల కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోందని చెప్పవచ్చు.
Also Read : ఆలీకి పవన్ కళ్యాణ్ ఝలక్ - స్నేహానికి పూర్తిగా తెగతెంపులు?
బాద్షా సాంగ్ ట్యూన్ కాపీ చేశారా?
'జాణవులే...' పాటపై వచ్చిన మరో విమర్శ, బాలీవుడ్ ర్యాపర్ బాద్షా చేసిన 'గెండా పూల్'కు దగ్గర దగ్గరగా ఉందని! రెండు పాటల్లో బీట్స్, ట్యూన్స్ మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయని ఇండస్ట్రీ సర్కిళ్ళలో వినబడుతోంది. ఇటువంటి విమర్శలు తమన్ మీద తరచూ వస్తున్నాయి. అతడి ఎదుగుదలను ఓర్వలేని కొందరు చేస్తున్న పని ఈ విమర్శలు అంటున్నారు అభిమానులు.
Also Read : ప్రభాస్, దీపిక సినిమా టైటిల్ లీక్ - కె మీనింగ్ అదేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
'బ్రో' సినిమాలో సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), నర్రా శ్రీను, యువ లక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ప్రధాన తారాగణం. ఇంకా ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఏ.ఎస్. ప్రకాష్, కూర్పు : నవీన్ నూలి, పోరాటాలు : సెల్వ, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్, సంగీతం : ఎస్.ఎస్. థమన్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల, నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & జీ స్టూడియోస్, నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, కథనం & మాటలు : త్రివిక్రమ్ శ్రీనివాస్, రచన & దర్శకత్వం : పి. సముద్రఖని.