'మనల్ని ఎవడ్రా ఆపేది?' - జనసేన పార్టీ అధినేతగా, రాజకీయ కోణంలో పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) చెప్పిన మాట. ఇప్పుడీ మాటను ఓ పాటలోకి తీసుకు వచ్చారు రామ జోగయ్య శాస్త్రి. 'బ్రో' సినిమాలోని మొదటి పాటను ఆ మాట గుర్తు వచ్చేలా రాశారు. 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన చిత్రం 'బ్రో'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సముద్రఖని రచయిత, దర్శకుడు. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో మొదటి పాటను ఈ రోజు విడుదల చేశారు. 


''కమాన్ కమాన్ డ్యాన్స్ బ్రో... 
యమా యమా బీట్స్ బ్రో... 
జిందగీనే జూకు బాక్స్ బ్రో...


రచ్చో రచ్చ రాక్స్ బ్రో... 
మజా పిచ్చ పీక్స్ బ్రో...
మనల్ని ఆపే మగాడు ఎవడు బ్రో'' 
అంటూ 'బ్రో' సినిమాలో మొదటి పాట 'మే డియర్  మార్కండేయ' సాగింది. తమన్ సంగీతంలో రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రేవంత్, సింగధ శర్మ పాడారు. 


''మనల్ని ఆపే మగాడు ఎవడు బ్రో'' లైన్స్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. 'మే డియర్ మార్కండేయ' పాటలో జీవిత సత్యాలు చెప్పారు. మళ్ళీ పుట్టి భూమి మీదకు రాలేమని, పద్దతిగా నిద్రలేచి ప్రతి రోజు పండగ చేసుకోమని, ఉన్న కాస్త టైములో అనుభవించి పోవాలని చెప్పారు. జీవిత కాలాన్ని పెంచలేమని అందంగా చెప్పారు. ఈ పాటలోనే బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేశారు.


Also Read తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టే కొడుకు వైఎస్ జగన్ - అదే 'యాత్ర 2'  



ఆ అమ్మాయి ఎవరు బ్రో?
'బ్రో' టీజర్ చూశారా? అందులో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మాత్రమే కాదు... ఓ హీరోయిన్ కూడా ఉన్నారు! సరిగ్గా 65 సెకన్ల దగ్గర పాజ్ బటన్ నొక్కి చూడండి. సాయి ధరమ్ తేజ్ ఎందుకో ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఆయన వెనుక చేతులు కట్టుకుని ఓ అమ్మాయి నిలబడింది. ఆమె ఎవరో తెలుసా? ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier). 'బ్రో'లో రొమాంటిక్ భామ కేతికా శర్మ కూడా ఉన్నారు.


Also Read : విజయ్ దేవరకొండను అమెరికా తీసుకు వెళుతున్న 'దిల్' రాజు, పరశురామ్!


'బ్రో' సినిమాలో సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), నర్రా శ్రీను, యువ లక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ప్రధాన తారాగణం. ఇంకా ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఏ.ఎస్. ప్రకాష్, కూర్పు : నవీన్ నూలి, పోరాటాలు : సెల్వ, వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి, ఛాయాగ్రహణం : సుజిత్ వాసుదేవ్, సంగీతం :  ఎస్.ఎస్. థమన్,  సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల,  నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & జీ స్టూడియోస్, నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, కథనం & మాటలు : త్రివిక్రమ్ శ్రీనివాస్, రచన & దర్శకత్వం : పి. సముద్రఖని. 





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial