Hari Hara Veera Mallu Latest News: వీరమల్లు విడుదలకు ముందు వైసీపీ పార్టీకి చెందిన అభిమానులు అలాగే కొంత మంది యాంటీ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరి ముఖ్యంగా శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాను బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇస్తున్నారు.


సినిమా వేదికలపై రాజకీయాలు ఎందుకు?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కథానాయకుడు మాత్రమే కాదు... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా! ఆయన దగ్గర కొన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ప్రభుత్వంలో తన విధులు నిర్వహిస్తూ వీరమల్లు చిత్రీకరణకు ప్రతి ఉదయం రెండు గంటల సమయం ఇచ్చిన రోజులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ వ్యాఖ్యల మీద వైసిపి ఫ్యాన్స్ విషం చిమ్ముతున్నారు. 








'భీమ్లా నాయక్' విడుదల సమయంలో వైసీపీ ప్రభుత్వం టికెట్ రేట్స్ తగ్గించింది.‌‌ ఏపీలోని థియేటర్లలో 10 నుంచి 15 రూపాయలకు టికెట్లు అమ్మిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ అంశాన్ని పవన్ మరోసారి ప్రస్తావించారు. రికార్డులు డబ్బుల గురించి కాదని గట్స్ గురించి అంటూ ఆయన ఘాటుగా మాట్లాడారు.


Also Read: పవన్ కళ్యాణ్ ఓ లెజెండ్... వీరమల్లు విడుదలకు ముందు క్రిష్ ట్వీట్... వైరల్ స్టేట్మెంట్ చూశారా?






'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ... ''సినిమాలో ఔరంగజేబును ఓడించడానికి ముందు నిజ జీవితంలో ఔరంగజేబు ఓటమిలో పవన్ కీలక పాత్ర పోషించారు'' అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు అన్ని సూటిగా వైసీపీని ఉద్దేశించి చేసినవే. దాంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం 'హరి హర వీరమల్లు' సినిమా మీద నెగిటివ్ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేసింది. సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్లో పలువురు ట్వీట్స్ చేస్తున్నారు.


Also Read: వీరమల్లుకు ముందు... నిధి అగర్వాల్ చేసిన సినిమాలు ఎన్ని? ప్రస్తుతం అవి ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఫుల్ డీటెయిల్స్‌