పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన నటించే అవకాశం హీరోయిన్ రాశీ ఖన్నా సొంతం చేసుకున్నట్లు పాఠకులకు రెండు రోజుల క్రితం తెలియజేసిన సంగతి తెలిసిందే (ఆ న్యూస్ చదివేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి). 'నో స్పాయిలర్స్' అంటూ రాశీ ఖన్నా కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటో షేర్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు రాశీ ఖన్నా న్యూస్ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసింది 'ఉస్తాద్ భగత్ సింగ్' టీమ్!

'ఉస్తాద్ భగత్ సింగ్'లో శ్లోక పాత్రలో!Raashii Khanna character from Ustaad Bhagat Singh revealed: 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో శ్లోక పాత్రలో రాశీ ఖన్నా నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అలాగే, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది. అది చూస్తే... ఫోటోగ్రాఫర్ పాత్రలో రాశీ ఖన్నా నటిస్తున్నట్లు అర్థం అవుతోంది. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ వై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

Also Read: పవన్ కళ్యాణ్ ఓ లెజెండ్... వీరమల్లు విడుదలకు ముందు క్రిష్ ట్వీట్... వైరల్ స్టేట్మెంట్ చూశారా?

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఆల్రెడీ శ్రీ లీల కొన్ని రోజులు షూటింగ్ చేశారు. ఇటీవల చిత్రీకరణలో రాశీ ఖన్నా జాయిన్ అయ్యారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. 'హరి హర వీరమల్లు' విడుదల నేపథ్యంలో చిత్రీకరణకు కాస్త బ్రేక్ ఇచ్చారు పవన్. ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఇతర కార్యక్రమాలు పూర్తి చేశారు. 

Also Read: అవతార్ 3 ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారోచ్... ట్రైలర్ రిలీజ్ అప్డేట్ కూడా!

దళపతి విజయ్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వం వహించిన 'తెరి' సినిమాలో మూల కథ (కోర్ పాయింట్) తీసుకుని దర్శకుడు హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' తెరకెక్కిస్తున్నారు. దీనిని రీమేక్ అని చెప్పలేం. 'దబాంగ్' చూసిన తర్వాత 'గబ్బర్ సింగ్' చూస్తే కొత్త సినిమాలా ఉంటుంది. తమిళ 'జిగర్తాండ'ను 'గద్దలకొండ గణేష్', హిందీ 'రైడ్'ను 'మిస్టర్ బచ్చన్'గా చేశారు హరీష్ శంకర్. ఆయన రీమేక్ చేస్తే కొత్త కథలా ఉంటుంది. అందులోనూ పవన్ వీరాభిమాని కావడంతో ఆయన నుంచి అభిమానులు ఆశించే హీరోయిజం, సన్నివేశాలతో పాటు కొత్తగా చూపిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.