Anupam Kher On Pawan Kalyan Hari Hara Veera Mallu: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో హరిహర వీరమల్లు ఒకటి. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రకటించి ప్రకటించిన మూడేళ్లు అవుతుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే మొదటి నుంచి ఈ సినిమా షూటింగ్స్‌కి బ్రేక్స్‌ ఎక్కువ అవుతున్నాయి. తరచూ ఏదోక కారణంతో 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ వాయిదా పడుతోంది.


Latest Update From Hari Hara Veera Mallu: ఇక ఇప్పుడు లాంగ్‌ బ్రేక్‌ పడింది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఆయన గత మూడు నెలలుగా రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన గెలిచిన డిప్యూటీ సీఎంగా పదవి కూడా చేపట్టారు. దీంతో ఆయన చేతిలో ఉన్న మూడు సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ని ఖుషి చేసే ఓ అప్‌డేట్‌ ఇచ్చింది 'హరిహర వీరమల్లు' టీం. తాజాగా ఈ సినిమాలోని ఓ కీ రోల్‌ని పరిచయం చేసింది మూవీ టీం. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అనుపమ్‌ కేర్‌ నటిస్తున్నట్టు తాజాగా ఓ ప్రకటన ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మూవీ నిర్మాణ సంస్థ ఆయన పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.






"లెజెండరి నటుడు, భారతీయ సినిమా గోప్ప నటుల్లో ఒకరైన ఆయన హరిహర వీరమల్లులో నటించబోతున్నారు. వెల్‌కమ్‌ ఆన్‌బోర్డ్‌ సర్‌" అంటూ మూవీ ఆయనకు స్వాగతం పలికింది. అంతేకాదు త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ కూడా ఇస్తామని మూవీ టీం పేర్కొంది. ఇక ఈ అప్‌డేట్‌ చూసి మెగాఫ్యాన్స్‌ అంతా ఖుష్‌ అవుతున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు హరిహర వీరమల్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు షూటింగ్‌లో త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌ జాయిన్‌ కాబోతోన్నారు. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ 17వ శతాబ్దానికి చెందిన వారియర్‌గా కనిపించబోతున్నారు. 



Also Read: కాబోయే కోడలు శోభితాపై నాగార్జున షాకింగ్‌ కామెంట్స్‌ - స్టేజ్‌పై అందరి ముందే అలా.. వీడియో వైరల్‌


నాగచైతన్య-శోభితా ఎంగేజ్‌మెంట్‌ - నెట్టింట సమంత రియాక్షన్‌, హార్ట్‌ బ్రేకింగ్‌ అంటూ పోస్ట్‌...