Parineeti Chopra Announce Her Pregnancy: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా రాఘవ్ చద్దా కపుల్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము పేరెంట్స్ కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ ఇంట్లోకి పండంటి బిడ్డ రాబోతోందని తెలిపారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వెళ్తున్న వీడియోను షేర్ చేస్తూ... 'మా చిన్ని ప్రపంచం... త్వరలో మా జీవితాల్లోకి రాబోతుంది.' అంటూ రాసుకొచ్చారు. దీంతో వీరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్, బాలీవుడ్ సెలబ్రిటీలు విషెష్ తెలిపారు.


ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణీతి చోప్రా 2023 సెప్టెంబరులో వివాహం చేసుకున్నారు. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అతిథుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రియాంక చోప్రా బంధువుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పరిణీతి చోప్రా 2011లో వచ్చిన 'లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్' మూవీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కిల్ దిల్, గోల్ మాల్ అగైన్, కేసరి, సైనా, ఇష్క్ జాదే, శుద్ధ్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు.


'అమర్ సింగ్ చంకీల' మూవీతో...


'అమర్ సింగ్ చంకీల' మూవీతో మంచి హిట్ సొంతం చేసుకున్నారు పరిణీతి చోప్రా. గతేడాది వచ్చిన ఈ మూవీకి ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించగా... పంజాబీ సంగీత కారుడి లైఫ్ స్టోరీ ఆధారంగా మూవీ తెరకెక్కించారు. రీసెంట్‌గా వచ్చిన 'యానిమల్'లోనూ ఈమెనే హీరోయిన్‌గా అనుకున్నా... ఆ తర్వాత రష్మికకు ఆ ఛాన్స్ దక్కింది. ఇటీవలే ఓ మూవీ, వెబ్ సిరీస్ పూర్తి చేశారు. తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు అనౌన్స్ చేశారు. 






Also Read: వారసత్వం... పెళ్లి వల్ల కాదు - ఒత్తిళ్లు ఎదుర్కొని స్వశక్తితోనే ఎదిగానన్న ఉపాసన


మరో హీరోయిన్ గుడ్ న్యూస్


మరో బాలీవుడ్ హీరోయిన్ మాళవిక రాజ్ సైతం గుడ్ న్యూస్ చెప్పారు. తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2023లో ప్రణవ్ బగ్గాను వివాహం చేసుకున్న ఆమె ఈ ఏడాది మేలో తాను గర్భం దాల్చిన విషయాన్ని రివీల్ చేశారు. తాజాగా తమకు పాప పుట్టినట్లు చెప్పారు. 'మన హృదయాల నుంచి మన చేతుల వరకూ మా లిటిల్ ప్రిన్సెస్' అంటూ రాసుకొచ్చారు. దీంతో సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.


2001లో వచ్చిన 'కభీ ఖుషీ కభీ ఘమ్' మూవీతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు మాళవిక రాజ్. తెలుగులో 'జయదేవ్' అనే మూవీలో నటించారు. రీసెంట్‌గా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'స్వైప్ క్రైమ్'లోనూ నటించారు.