Bollywood Actor Avneet Kaur Reaction: ఇండియన్ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ అప్పుడెప్పుడో అనుకోకుండా తన పోస్టుకు లైక్ కొట్టడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్. అటు సోషల్ మీడియాలోనూ ఇటు బయట కూడా కోహ్లీ ఆమె పోస్ట్ లైక్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తన ఇన్ స్టాలో ఫీడ్ క్లియర్ చేస్తుండగా... పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయి ఉండొచ్చంటూ విరాట్ వివరణ కూడా ఇచ్చారు. 


తాజాగా... ఈ అంశంపై ఎట్టకేలకు అవనీత్ కౌర్ స్పందించారు. తన రీసెంట్ మూవీ 'లవ్ ఇన్ వియత్నాం' ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె... నెటిజన్లే కాకుండా స్టార్ నటీనటులు కూడా తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నట్లు చెప్పారు. 'ప్రేమ దొరుకుతూనే ఉండాలి. నేను ఈ మాటకు మించి చెప్పలేను.' అంటూ నవ్వుతూ చెప్పారు. దీంతో ఆమె కోహ్లీ లైక్‌పై ఇండైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: రామ్ చరణ్ 'పెద్ది' ఆఫర్‌నే రిజెక్ట్ చేస్తావా? - మలయాళ బ్యూటీపై ట్రోలింగ్


అసలేం జరిగిందంటే?


చాలా రోజుల కిందట సోషల్ మీడియాలో అవనీత్ కౌర్ ఫోటోకు అనుకోకుండా విరాట్ కోహ్లీ లైక్ కొట్టారు. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. మిలియన్లలో ఇన్ స్టాలో ఫాలోవర్స్ పెరిగారు. దీంతో పాటే ఆమె బ్రాండ్ కూడా అమాంతం పెరిగిందనే వార్తలు వచ్చాయి. దాదాపు 12 బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు ఆమె సైన్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే... బోల్డ్ ఫోటోస్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేసే ఆమె ఫోటోకు కోహ్లీ ఎందుకు లైక్ కొట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. 


ఈ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... అసలేం జరిగిందో తెలుసుకునే లోపే రచ్చ చేశారు నెటిజన్లు. ఆ తర్వాత దీనిపై స్వయంగా విరాట్ కోహ్లీనే స్పందించి వివరణ ఇచ్చారు. తన ఇన్ స్టా ఫీడ్ క్లియర్ చేసే టైంలో బహుశా అల్గారిథం మిస్టేక్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చంటూ క్లారిటీ ఇచ్చారు. అనవసర పోస్టులు పెట్టొద్దని కోరారు. అటు, ఈ అంశంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు సెలబ్రిటీలు సైతం రియాక్ట్ అయ్యారు. అసలు పొరపాటున జరిగిందా? లేదా అనేది పూర్తిగా తెలుసుకోకుండానే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాసేశారంటూ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారని... తన దృష్టిలో ఇది అనసవసరమని రకుల్ రాసుకొచ్చారు.