Yash’s Toxic Movie : రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్-ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. కేజీఎఫ్​ తర్వాత యశ్ నుంచి వచ్చే సినిమా కోసం అందరూ ఎదురు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మేకర్స్ టాక్సిక్ మూవీని నెక్స్ట్​ లెవెల్​కి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీని తీసుకొచ్చారు. 


హాలీవుడ్ రేంజ్ యాక్షన్స్


టాక్సిక్​ సినిమాపై అభిమానుల్లో ఉన్న అంచనాలు ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని రెట్టింపు చేసేలా.. హాలీవుడ్​ రేంజ్​లో యాక్షన్ సీన్స్​ని తెరకెక్కిస్తోంది చిత్రబృందం. అందుకే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం.. ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన టాప్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్​ జె.జె. పెర్రీని తీసుకొచ్చారు. 


45 రోజుల షెడ్యూల్


జె.జె. పెర్రీ ఇండియన్ స్టంట్ టీంతో ముంబైలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. 45 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ కొనసాగనుంది. అయితే దీనిలో కేవలం ఇండియన్ స్టంట్ టీం మాత్రమే పని చేయనున్నట్లు తెలుస్తోంది. ‘టాక్సిక్’ కోసం ఇండియన్ స్టంట్ టీంను మాత్రమే తీసుకుని యాక్షన్ సీక్వెన్స్ భారీగా.. హాలీవుడ్‌ స్థాయికి ధీటుగా.. ప్లాన్ చేశారట పెర్రీ. అంతర్జాతీయ స్థాయిలో ‘టాక్సిక్’ను రూపొందిస్తామని తెలిపారు పెర్రీ.


హై బడ్జెట్​తో ఇంగ్లీష్​లో కూడా


ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌.. యశ్​ కెరీర్​లో మరో మైలురాయిగా నిలవనుందని అంటున్నాయి చిత్రవర్గాలు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్​లో ఒకేసారి చిత్రీకరిస్తున్న మొట్టమొదటి హై బడ్జెట్‌ ద్విభాషా చిత్రం ఇదే.


ఈ మూవీని హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా ఇతర భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా వరల్డ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ మూవీగా ‘టాక్సిక్’ను తెరకెక్కిస్తున్నారు. మార్చి 19, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 


యశ్ నెక్స్ట్ లైన్ అప్


టాక్సిక్ చేస్తూనే యశ్ రామాయణం సినిమాలో రావణుడిగా చేస్తున్నాడు. కేజీఎఫ్ 3పై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ప్రశాంత్ మరోసారి యశ్​ని రాఖీగా చూపిస్తారంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైతే.. అభిమానాల్లో టాక్సిక్​పై అంచనాలు రోజురోజుకి పెంచేస్తున్నారు మేకర్స్.