బాక్స్ ఆఫీస్ బరిలో మొదటి రోజు నుంచి 'పరదా'కు ఆడియన్స్ రాక చాలా అంటే చాలా తక్కువ ఉంది. అయితే అందుకు కారణం రివ్యూలు అన్నట్టుగా దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల సింపతీ కార్డు ప్లే చేశారు. ప్రాణం ఉండగా సినిమాను చంపొద్దని, మూడు రోజుల్లో రిజల్ట్ డిసైడ్ చేయవద్దని రిక్వెస్ట్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ అయితే ఎవరికైనా సినిమా నచ్చకపోతే తమ తప్పు కాదన్నట్టు మాట్లాడారు. అయితే థియేటర్లకు ప్రేక్షకుల రాక మాత్రం పెరగలేదు.
మండే కలెక్షన్లు తగ్గాయా? స్టడీగా ఉన్నాయా!?తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో సోమవారం కలెక్షన్లు పెరగలేదు. అలాగని మరీ కిందకు పడలేదు. స్టడీగా ఉన్నాయ్. కానీ, హిట్ స్టేటస్ అందుకోవాలంటే ఇవి ఏమాత్రం సరిపోవు. పబ్లిసిటీ ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేదు. ఓపెనింగ్ డే 'పరదా'కు తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షల రూపాయలు వస్తే... మర్నాడు రూ. 14 లక్షలు, మూడో రోజైన ఆదివారం రూ. 13 లక్షలు వచ్చాయి. మండే అయితే ఈ మూవీ చూసేందుకు జనాలు ఎగబడలేదు. సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 'పరదా'కు వచ్చిన నెట్ కలెక్షన్ 10 లక్షల రూపాయలు మాత్రమే.
ఫస్ట్ వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో 'పరదా' రూ. 49 లక్షల రూపాయల నెట్ కలెక్ట్ చేస్తే... ఆ తర్వాత మండే పది లక్షల నెట్ కలెక్షన్ రాబట్టింది. దాంతో నాలుగు రోజుల్లో ఈ సినిమా తెలుగు స్టేట్స్ నెట్ కలెక్షన్ రూ. 49 లక్షలు అయ్యింది.
మలయాళంలో మండే పర్వాలేదు కానీ...!ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూసిన తర్వాత మలయాళంలో మండే కాస్త పర్వాలేదనే రీతిలో 'పరదా' కలెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ, ఆ నంబర్స్ చూస్తే షాక్ అవుతారు. ఈ సినిమాకు మలయాళంలో మొదటి రోజు ఆరు లక్షల రూపాయలు వచ్చాయి. ఫస్ట్ డే షోస్ సరిగా పడలేదు. సెన్సార్ ఇష్యూ వల్ల కాస్త ఆలస్యంగా పడ్డాయి. అందువల్ల మొదటి రోజు సరిగా రాలేదని సరిపెట్టుకుంటే రెండో రోజు మరీ దారుణంగా రెండు లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. మూడో రోజు ఆదివారం గనుక థియేటర్లకు జనాలు వస్తారని అనుకుంటే అదీ జరగలేదు. కేవలం లక్ష మాత్రమే వచ్చింది. అయితే మండే సినిమాకు మూడు లక్షల రూపాయలు రావడం గొప్ప.
Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై నారా రోహిత్ రియాక్షన్ అదేనా? సింపుల్‌గా హర్ట్ చేయకుండా చెప్పేశారా?
టోటల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు చూస్తే... నాలుగు రోజుల్లో 'పరదా'కు కేవలం 68 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. థియేటర్లలో రిలీజ్ చేసినందుకు వచ్చిన ఖర్చులు సైతం రాలేదని ట్రేడ్ టాక్. అనుపమ, ప్రవీణ్ కాండ్రేగుల కలిసి తప్పంతా రివ్యూ రైటర్లది అన్నట్టు... బాగున్న సినిమాకు కొందరు సరిగా రేటింగ్స్ ఇవ్వలేదని అన్నట్టు సింపతీ కోసం ట్రై చేశారు. అది వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదు. రిజల్ట్ మాత్రం వేరేలా ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర నంబర్స్ రావడం లేదు.
Also Read: పరదా వర్సెస్ శుభం కలెక్షన్లు... ఓపెనింగ్ డే రిజల్ట్ క్లియర్... సమంత క్రేజ్ ముందు అనుపమ వెలవెల!