Bigg Boss Priyanka Singh Hospitalised: 'బిగ్‌బాస్‌' ఫేం ప్రియాంక సింగ్‌ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇటీవల హీరోయిన్‌గా లాంచ్‌ అవుతున్నాంటూ మురిసిపోయిన ప్రియాంక అంతలోనే చేదు వార్త చెప్పింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వీడియో- తాజాగా బయటకు వచ్చింది. తాను చేసిన తప్పే ఇలా ప్రాణం మీదకు వచ్చిందని.. నాలా మీరు ఎవరూ చేయొద్దంటూ ఈ వీడియో వివరించింది ప్రియాంక. ప్రయాంక సింగ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బిగ్‌బాస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న ఆమె ట్రాన్స్‌ జెండర్‌ అనే విషయం తెలిసిందే. జబర్దస్త్‌లో లేడీ గెటప్‌తో అలరించిన ఆమె ఆ తర్వాత సర్జరీ చేసుకుని పూర్తిగా అమ్మాయిలా మారిపోయింది.


ప్రస్తుతం ఆమె అందానికి సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఆమె గ్లామరస్ లుక్‌కి, అందానికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా పెరిగింది. అలా బిగ్‌బాస్‌తో స్టార్‌ ఇమేజ్‌ పొందిన ప్రియాంక బయటకు వచ్చాక నటిగా ఫుల్‌ బిజీ అయిపోయింది. ఇటీవలే ఓ ఇంటర్య్వూలో ఆమె ఈ విషయాన్ని కూడా చెప్పింది. ప్రస్తుతం 'హనుమాన్‌' ఫేం ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో చేస్తున్నానని, త్వరలో హాట్‌స్టార్‌లో హీరోయిన్‌గా లాంచ్‌ అవుతున్నానంటూ మురిసిపోయింది. అయిదే తాజాగా తన యూట్యూబ్‌ చానల్లో వీడియో షేర్ చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యానంది. జీ జోడీ డ్యాన్స్‌ కోసం తాను చేసిన తప్పిదం వల్లే ఆసుపత్రి పాలయ్యానని తెలిపింది. తన ఆరోగ్యం బాగా క్షీణించిందని, దాంతో ఏఐజీ హాస్పిటల్లో చేరానంటూ చెప్పింది. 



ఈ వీడియో ప్రియాంక మాట్లాడుతూ.. "ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. నటులు కష్టాలు ఎలా ఉంటాయంటే. వాళ్లు ఎంత బాధ అనుభవిస్తున్న నవ్వుతూ పని చేయాలి. ప్రస్తుతం నేను జీ తెలుగు షో చేస్తున్నారు. ఆ షోకు పర్ఫామెన్స్‌ చేయాలంటే ప్రాక్టిస్‌ చేయాలి. ఒకరోజు ప్రాక్టిస్‌ తర్వాత నా హెల్త్‌ అసలు సపోర్టు చేయడం లేదు. చాలా డిహైడ్రేట్‌ అయ్యాను. లివర్‌, యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌.. ప్లేట్‌లేట్స్‌ తగ్గిపోయాయి. 20 రోజులుగా కంటిన్యూస్‌గా డ్యాన్స్‌ ప్రాక్టిస్‌ చేశాను. దానివల్ల బాడీ బెయిన్స్ రావడంతో పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకున్నాను. ఎలాంటి ప్రిస్‌క్రిప్షన్‌, డాక్టర్‌ సలహా లేకుండా తెలిసిన మెడిసిన్స్‌ వాడి ఇంతవరకు తెచ్చుకున్నాను. ఎంతలా ఉంటే దాదాపు లివర్ టిష్యూష్‌ డ్యామేజ్‌ అయ్యేవరకు వచ్చింది. 


Also Read: ప్రభాస్ సినిమా నుంచి తీసేశారు, పవన్‌తో నటించలేదు - రకుల్ టాలీవుడ్ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!


మెడికల్‌ షాప్స్‌ తిరుగుతూ.. ఓవర్ డోస్‌ మెడిసన్స్‌, యాంటిబయాటిక్‌ వంటి మందులు వాడటం వల్ల ఇలా తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాను. ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే. నాలా ఎవరూ డాక్టర్‌ సలహా లేకుండా మందులు వాడకండి. సొంత వైద్యం ఫాలో అవ్వకండి. ఏం జరిగిన మన మంచికే అనుకుంటారు. ఇది వెర్రితనం. ఎలాంటి హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్న డాక్టర్‌ను సంప్రదించండి. వారు ఇచ్చిన సలహా, సూచనలే పాటించండి. నేను నా సొంతంగా మందులు వాడి ఇలా ప్రాణం మీదకు తెచ్చుకున్నాను. ముఖ్యం పెయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా వాడటం వల్ల ఇవి నా లివర్‌పై ప్రభావం చూపాయి. ఆస్పత్రి పాలవ్వడంతో ఆ డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ కూడా చేయలేకపోయా. నా స్థానంలో ఆక్సా ఖాన్‌ చేశారు" అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది.