సూపర్ స్టార్ మహేష్ బాబుకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఈతరంమోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ హీరో అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. ఇక ఇండస్ట్రీలో ఉన్నవారైతే ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తారు.. మరికొంత మంది కనీసం మహేష్ బాబుతో కలిసి కనీసం సెల్ఫీ అయినా తీసుకునే అరుదైన అవకాశం కోసం కలలు కంటారు. కానీ బిగ్ బాస్ ఫేమ్ దివికి మాత్రం ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశం లభించింది. ఆ టైంలో ఏం జరిగిందో తాజాగా దివి వెల్లడించింది. ముఖ్యంగా మహేష్ బాబు పుట్టుమచ్చల గురించి దివి చేసిన స్టన్నింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 


మహేష్ బాబు పుట్టుమచ్చల పై దివి కామెంట్స్


బిగ్ బాస్ తో పాపులర్ ఆయిన దివి అప్పటికే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అలాగే 'మహర్షి' మూవీలో కూడా ఓ పాత్రను పోషించింది. తాజాగా 'మహర్షి' సినిమాలో చేస్తున్నప్పుడు జరిగిన ఇంట్రెస్టింగ్ మెమొరీస్ ను గుర్తు చేసుకుంది. షూటింగ్ లో అమ్మాయిలు అంతా మహేష్ బాబు గురించే మాట్లాడేవారని, సెట్లో ఎంత మంది అబ్బాయిలు ఉన్నా మహేష్ బాబు మాత్రం అందంగా వెలిగిపోయే వారని మహేష్ పట్ల అభిమానాన్ని వ్యక్తం చేసింది. మహేష్ బాబుతో 'మహర్షి' సినిమాలో చాలా సీన్స్ ఉండగా, ఎడిటింగ్ లో లేపేశారని వెల్లడించింది. దివి మాట్లాడుతూ "ఇద్దరి మధ్య ఓ సీన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు మహేష్ బాబు నుదుటిపై పుట్టుమచ్చ చూశాను. ఆయన హెయిర్ పైకి అనుకున్నప్పుడు అది మరింత అందంగా అన్పించేది. ఓ సీన్ లో మహేష్ తో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేయాలి. ఆ టైమ్ లో మీ ఫోర్ హెడ్ మీదున్న పుట్టుమచ్చ బాగుంది సర్ అని చెప్పాను. ఆయన వెంటనే సీన్ కు కట్ చెప్పి, నవ్వేశారు. సితార కూడా ఆ పుట్టుమచ్చ బాగుందని చెప్తుందని అన్నారు" అంటూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది. 


Also Read'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?


దివి ట్రాజెడీ లవ్ స్టోరీ


దివి 2017లోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి ఫేమ్ దక్కించుకుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకుంది. ముఖ్యంగా 'మహర్షి' సినిమా తర్వాత ఆమెకు మంచి క్రేజ్ పెరిగింది. తరువాత ఏ1 ఎక్స్ప్రెస్, జిన్నా వంటి సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. అయితే బిగ్ బాస్ సీజన్-4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత దివికి అవకాశాలు బాగా పెరిగాయి. పుష్ప 2, డాకు మహారాజ్ వంటి సినిమాల్లో కూడా నటించే అద్భుతమైన ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్న దివి కొన్ని రోజుల క్రితం తన ట్రాజెడీ లవ్ స్టోరీని బయటపెట్టింది. బీటెక్ చదువుతున్న రోజుల్లోనే తాను ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను అని, ఎంటెక్ చదివే వరకు ఇద్దరం రిలేషన్ లోనే ఉన్నామని వెల్లడించింది. పెద్దలు పెళ్లికి కూడా అంగీకరించిన తర్వాత పలు కారణాల వల్ల తన బాయ్ ఫ్రెండ్ ఊర్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని, తనేమో ఇక్కడే ఉండడం వల్ల విడిపోవలసి వచ్చిందని చెప్పింది. ఇక మరోవైపు మహేష్ బాబు SSMB 29 షూటింగ్ లో బిజీగా ఉన్నారు.