మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). దీనికి స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 10 ఏళ్ళ తర్వాత ఆయన మెగాఫోన్ పట్టిన చిత్రమిది. ఆల్రెడీ 'భోళా మేనియా' పాటను విడుదల చేశారు. ఈ రోజు సెలబ్రేషన్ యాంథమ్ 'జామ్ జామ్ జజ్జనక'ను విడుదల చేశారు. 


చిరుతో పాటు కీర్తీ, తమన్నా, సుశాంత్ డ్యాన్స్!
Jam Jam Jajjanaka Song : 'జామ్ జామ్ జజ్జనక' లిరికల్ వీడియో చూస్తే... చిరుతో పాటు ఈ పాటలో కీర్తీ సురేష్, సుశాంత్, తమన్నాతో స్టెప్పులు వేశారు. సంతోషం, సంబరం నిండిన సమయాల్లో అందరూ పాడుకునే పాటలా రూపొందించినట్లు చిత్ర బృందం పేర్కొంది.   


''అరే డప్పేస్కో... దరువేస్కో!
వవ్వారే అదిరే పాటేస్కో!


అరే ఈలెస్కో... ఇగ జూస్కో
ఇయ్యాల డ్యాన్సు ఇరగేస్కో!


ధనాధానా గంతేసుకో... 
సయ్యారే సయ్యంటూ చిందేసుకో!


ఘనాఘనా ఊపేసుకో... 
నీ స్టెప్పుతోటి టాపు లేపేసుకో!''
అంటూ సాగే ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రాశారు. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. సినిమాలో సందర్భానికి తగ్గట్టు పాటను తెరకెక్కించామని, పాటలో అభిమాన హీరో హీరోయిన్లు స్టెప్పులు వేస్తుంటే చాలా సందడిగా ఉంటుందని దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు.


Also Read : మంగళవారం హైదరాబాద్‌లో దిగిన దీపికా పదుకోన్ - ఎందుకంటే?



ఆల్రెడీ విడుదలైన 'భోళా మేనియా' సాంగ్, జూన్ 24న విడుదల చేసిన 'భోళా శంకర్' టీజర్... రెండిటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని  చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. 


ఆగస్టు 11న 'భోళా శంకర్' విడుదల!
'భోళా శంకర్' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం ముగిసింది. చిరంజీవి తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ సైతం పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. 


Also Read బాలకృష్ణ అభిమాని... కలకత్తా వెళ్లి మరీ మార్టినెజ్‌తో ఫోటో, ఎవరీ మార్టినెజ్‌?



ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషించారు. కీర్తీ సురేష్ ప్రేమికుడిగా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటించారు. 


రఘు బాబు, మురళీ శర్మ, రవి శంకర్, 'వెన్నెల' కిశోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, 'హైపర్' ఆది, 'వైవా' హర్ష, రష్మీ గౌతమ్, ప్రదీప్, బిత్తిరి సత్తి, సత్య, 'గెటప్' శ్రీను, వేణు టిల్లు (బలగం దర్శకుడు వేణు ఎల్దండి), 'తాగుబోతు' రమేష్, ఉత్తేజ్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు : మార్తాండ్ కె వెంకటేష్, కథా పర్యవేక్షణ : సత్యానంద్, మాటలు : తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్ : రామ్ - లక్ష్మణ్ & దిలీప్ సుబ్బరాయన్ & కాచే కంపాక్డీ, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత :  కిషోర్ గరికిపాటి, ఛాయాగ్రహణం : డడ్లీ.