పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాపై కుమ్మరి కులస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పతాక సన్నివేశాల్లో తమ మనోభావాలను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ, వివాదం ఏమిటి? సినిమాలో ఏయే సన్నివేశాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళితే...
'భీమ్లా నాయక్' సినిమాలో పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి మధ్య చిత్రీకరించిన యాక్షన్ దృశ్యాల్లో... ఓ చోట కుమ్మరులు పవిత్రంగా భావించే సారెను (చక్రాన్ని) కాలితో రానా తన్నారని, ఇది తమ వర్గాన్ని అవమానించేలా ఉందని కుమ్మర శాలివాహన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షకులు డా. మానేపల్లి వీవీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. ఇంకా సినిమాలో పలు సన్నివేశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలిగించాలని డిమాండ్ చేయడంతో పాటు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు.
Also Read: 'సాహో' దర్శకుడితో పవన్ 'తేరి' రీమేక్ చేస్తున్నారా? అసలు నిజం ఏంటంటే?
'భీమ్లా నాయక్' సినిమాలో సన్నివేశం కుమ్మరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్న వీవీఎస్ఎన్ మూర్తి... హీరోలు పవన్, రానాతో పాటు చిత్ర దర్శకుడు సాగర్ కె. చంద్ర, నిర్మాత సూర్య దేవర నాగవంశీపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తమ వర్గాన్ని అవమానించిన కుమ్మర శాలివాహనులకు పవన్ కల్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: 'ఇది పవన్ పై దాడి కాదు, థియేటర్ వ్యవస్థపై దాడి' నిర్మాత ఫైర్!