గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) డ్యాన్సులో గ్రేస్ ఉంటుంది. ఆయనలో ఓ హుషారు ఉంటుంది. అది స్టెప్పుల్లో కనబడుతుంది. ఆ గ్రేస్, హుషారుకు తగ్గట్టు శ్రీ లీల (Sreeleela) లాంటి డ్యాన్స్ పార్ట్నర్ తోడుగా ఉంటే? వినాయక చవితి సందర్భం కుదరడంతో పాటు తమన్ మాంచి బాణీ అందిస్తే? ఇంకేముంది... 'గణేష్ యాంథమ్' పాటలా ఉంటుంది.
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ నటించారు. యువ కథానాయిక శ్రీ లీల కీలకమైన పాత్ర పోషించారు. సినిమాలో తొలి పాట 'గణేష్ యాంథమ్'ను ఈ రోజు విడుదల చేశారు.
బాలయ్య వస్తే తీన్మార్ కాదు... సౌమార్ కొట్టాలి!
Ganesh Anthem Song - Bhagavanth Kesari Movie : వినాయక చవితి నేపథ్యంలో 'గణేష్ యాంథమ్'ను తెరకెక్కించారు. ఆల్రెడీ ప్రోమో విడుదల చేశారు. 'జై బోలో గణేష్ మహారాజ్ కి' అంటూ ఈ సాంగ్ మొదలైంది. ఆ తర్వాత పిల్లల మధ్యలో స్టెప్పులు వేస్తున్న శ్రీ లీలను చూపించారు. తర్వాత బాలకృష్ణను చూపించారు. పసుపు రంగు షర్టు, కళ్ళజోడుతో ఆయన ఎంట్రీ అదిరింది. డప్పులతో కొంతమంది తీన్మార్ కొడుతుంటే 'బిడ్డా! ఆనతలేదు. సప్పుడు జర గట్టిగా చేయమను' అని బాలకృష్ణ అడగడం... అప్పుడు శ్రీ లీల 'అరే తీసి పక్కన పెట్టండ్రా మీ తీన్మార్! మా చిచ్చా వచ్చిండు! ఎట్లా ఉండాలే! కొట్టరా కొట్టు... సౌమార్' అనడంతో పాటకు ఊపు వచ్చింది. ఈ రోజు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.
కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను కరీముల్లా, మనీషా పండ్రంకీ ఆలపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ''బిడ్డా!! చిచ్చా వచ్చిండు ... మనకి పండగ ముందే తెచ్చిండు'' అంటూ యూనిట్ ఈ పాటను విడుదల చేసింది.
Also Read : 'సలార్' కాదు - ఆ రోజు ఎన్టీఆర్ బావమరిది నితిన్ 'మ్యాడ్'!
'భగవంత్ కేసరి' బిజినెస్ క్లోజ్ - లాభాల్లో నిర్మాత!
Bhagavanth Kesari Pre Release Business Details : విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 19న 'భగవంత్ కేసరి' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్. పాలక్ లల్వాని కీలక పాత్ర చేస్తున్నారు. సినిమా విడుదలకు సుమారు రెండు నెలల ముందు బిజినెస్ క్లోజ్ అయ్యింది. నైజాం థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను 14 కోట్ల రూపాయలకు, సీడెడ్ (రాయల సీమ) హక్కులను రూ. 12 కోట్లకు, ఆంధ్రలో అన్ని ఏరియాల హక్కులను సుమారు 34 కోట్ల రూపాయలకు ఇచ్చారట.
Also Read : ప్రభాస్ అభిమానులకు షాక్ - 'సలార్' విడుదల వాయిదా!?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్టాల హక్కులను రూ. 60 కోట్లకు అమ్మేశారు. 'వీర సింహా రెడ్డి'తో సంక్రాంతికి బాలకృష్ణ భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 63 కోట్లు. 'భగవంత్ కేసరి' ఓవర్సీస్ రైట్స్ కలిపితే రూ. 70 కోట్లు దాటుతుంది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఎలాగో ఉన్నాయి. మొత్తం మీద నిర్మాతలు లాభాల్లో ఉన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial