Bagheera Movie Teaser: దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజిఎఫ్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ ప్రస్తుతం 'సలార్' మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రశాంత్ నీల్ మొదటిసారి టాలీవుడ్ హీరో ప్రభాస్ తో చేస్తున్న సినిమా కావడంతో 'సలార్'పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కన్నడ నాట టాప్ ప్రొడక్షన్ హౌస్ గా దూసుకుపోతున్న హోంబలే ఫిలింస్ 'సలార్'తో పాటు మరో ప్రాజెక్టును సైతం లైన్లో పెట్టింది. ప్రస్తుతం 'సలార్' యాక్షన్ టైలర్ కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రేమికులకు హోంబలే ఫిలిమ్స్ మరో సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. ఆ సినిమా పేరే 'భగీర'.


'ఉగ్రమ్' మూవీ ఫేమ్ శ్రీమురళి హీరోగా హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న సినిమా 'భగీర'. ఈ సినిమాకు 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడం విశేషం. కన్నడ డైరెక్టర్ సూరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. విజయ్ కిరగందుర్ నిర్మాత. గణేషన్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన భగీర మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 17న కన్నడ హీరో శ్రీ మురళి పుట్టినరోజు కావడంతో భగీర మూవీ టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు శ్రీమురళి. అందులో ఒకటి పోలీస్ గెటప్ కావడం విశేషం.






ఇప్పటివరకు గ్యాంగ్ స్టర్ కథలను రాసిన ప్రశాంత్ నీల్ మొదటిసారి పోలీస్ క్యారెక్టర్ తో కూడిన కథను రాశాడు. శ్రీ మురళి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండడంతో పాటు మరో డిఫరెంట్ గెటప్ లో కనిపించాడు. మొదట పోలీస్ ఆఫీసర్ గా ఉండే హీరో ఆ తర్వాత న్యాయం కోసం యూనిఫామ్ వదిలేసి యుద్ధం చేయడమే ఈ సినిమా కథాంశంగా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ మొత్తం ప్రశాంత్ స్టైల్ లోనే డార్క్ థీమ్ లోనే ఉండడం విశేషం. టీజర్ లో క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కనిపిస్తోంది.


అజినీస్ లోకనాథ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ కథ అందించడం దీనికి హోం బలే ఫిలిమ్స్ తోడవడంతో 'భగీర' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు భగీర పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంటుందా? లేక రీజనల్ మూవీ గానే ఉండిపోతుందా? అనేది చూడాలి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


Also Read : నేను గుడ్ యాక్టర్, గ్రేట్ రైటర్, బ్యాడ్ డైరెక్టర్ - అడివి శేష్ షాకింగ్ కామెంట్స్!