యంగ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) అకౌంట్‌లో హిట్స్, సూపర్ హిట్స్ కొన్ని ఉన్నాయి. ప్రామిసింగ్ యాక్టర్ కేటగిరీలో ఉన్నారు కూడా! హ్యాండ్సమ్ కావడంతో ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మిడ్ రేంజ్ యంగ్ హీరోల్లో మంచి కటౌట్ ఉన్న క్యాండిడేట్. కానీ, ఆయన నటించిన సినిమా వస్తుందనే సంగతి ఆడియన్స్ చాలా మందికి తెలియదు. ఆడియన్స్ సంగతి పక్కన పెట్టండి... ఇండస్ట్రీలో కూడా చాలా మంది తెలియదు. ఆయన రేంజ్ హీరో సినిమాల్లో రీసెంట్ టైమ్స్‌లో ఇంత పూర్ ప్లానింగ్, బ్యాడ్ రిలీజ్ మరో సినిమాకు లేదని చెప్పాలి.
కార్తీక్... వెరీ బ్యాడ్ ప్లానింగ్ అమ్మా!హిట్టూ ఫ్లాపులు ప్రేక్షకుల చేతిలో ఉంటాయి. సినిమా రిలీజుకు ముందు హిట్ చెయ్యాల్సిన బాధ్యత హీరో, దర్శక నిర్మాతల చేతిలో ఉంటుంది. అందులోనూ రీసెంట్ టైంలో ప్రతి వారం మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయ్. కాంపిటీషన్ తట్టుకోవాలంటే ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలలో తమ సినిమా గురించి చెప్పడం ఎంతైనా అవసరం. సినిమాను ప్రేక్షకులోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం మరీ ఎక్కువ అయ్యింది. 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీం ఇవేవీ చేయలేదు. సినిమాను లైట్ తీసుకున్నట్టు ఉన్నారు.
ఏప్రిల్ 17న తిరువీర్ హీరోగా నటించిన 'పాపం ప్రతాప్' థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమా కోసం వెరైటీ పబ్లిసిటీ చేసింది టీం. కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' విడుదల కూడా శుక్రవారమే. స్టార్ హీరోల గెటప్పులతో ఓ ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. అందులో బాలయ్యగా కిరణ్ అబ్బవరం గెటప్ వైరల్ అయ్యింది. దానికి కూడా బజ్ బాగా వచ్చింది. కానీ, 'బ్యాడ్ బాయ్ కార్తీక్' మాత్రం సౌండ్ చేయడం లేదు. ఈ విషయం టీం ప్లానింగ్ వెరీ బ్యాడ్ అని చెప్పాలి.
ప్రీమియర్స్ ఎక్కడ? పూర్ రిలీజ్ బాయ్!రీసెంట్ ట్రెండ్ గమనిస్తే... ప్రతి సినిమాకు పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. 'నారి నారి నడుమ మురారి' విడుదలకు ముందు శర్వానంద్ ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూ అంటూ మీడియా ముందుకు వచ్చింది తక్కువ. ప్రింట్ అండ్ వెబ్ ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు. ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసి బజ్ వచ్చేలా చేశారు.
సంక్రాంతికి కాంపిటీషన్ ఉన్నప్పటికీ... 'నారి నారి నడుమ మురారి'కి హిట్ టాక్ రావడం వెనుక ప్రీమియర్స్ హెల్ప్ చేశాయి. 'బ్యాడ్ బాయ్ కార్తీక్'కు నాగశౌర్య అటువంటివి ఏమీ చేయలేదు.'పాపం ప్రతాప్' టీం ప్రీమియర్స్ ప్లాన్ చేసింది. సెన్సార్ ఇష్యూ వల్ల తమ సినిమాకు ప్రీమియర్స్ వేయడం పాజిబుల్ కాలేదని కిరణ్ అబ్బవరం చెప్పారు. నాగశౌర్య సినిమాకు ప్రీమియర్స్ ప్రస్తావన లేదు. అంత ఎందుకు? ఇన్‌స్టాగ్రామ్‌లో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' గురించి ఆయన ఒక్క పోస్ట్ అంటే ఒక్కటి కూడా చేయలేదు. ప్రెస్ మీట్స్‌లోనూ సినిమా గురించి సరిగా మాట్లాడింది లేదు.
'రంగబలి' విడుదలైన మూడేళ్ళ తర్వాత సినిమా వస్తుందంటే ఎలా ఉండాలి? కమ్ బ్యాక్ సినిమాకు ఏ రేంజ్ ప్రమోషన్ చేయాలి? 'బ్యాడ్ బాయ్ కార్తీక్'కు నాగశౌర్య అటువంటివి ఏమీ చేయలేదు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే... హైదరాబాద్ సిటీలో మూడు నాలుగు సింగిల్ స్క్రీన్స్ తప్ప సినిమాకు సరైన థియేటర్లు లేవు. మల్టీప్లెక్స్‌లలోనూ సినిమాకు సరైన షోస్ లేవు. ప్రతి ఏరియాలో ఒకట్రెండు మాత్రమే షెడ్యూల్ చేశారు. సినిమాను విడుదల చేసి 'మమ' అనిపించుకుని చేతులు దులిపేసుకుందామని నాగశౌర్య అనుకుంటున్నారా?
