Naga Shaurya Bad Boy Karthik Movie First Review: యంగ్ హీరో నాగశౌర్యకు మంచి నటుడు అని పేరు ఉంది. అయితే ఆయన సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చి దాదాపు మూడేళ్ళు అవుతోంది. 'రంగబలి' (జూలై 7, 2023) తర్వాత ఈ శుక్రవారం (ఏప్రిల్ 17, 2026) 'బ్యాడ్ బాయ్ కార్తీక్'తో థియేటర్లలోకి వస్తున్నారు. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో టాక్ ఏంటి? సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది? దీనితో నాగశౌర్యకు హిట్ వస్తుందా? అనేది ఒక్కసారి చూద్దాం.

Continues below advertisement

పెద్దలతో పాటు పిల్లలకూ 'బ్యాడ్ బాయ్ కార్తీక్''బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమాకు సెన్సార్ బోర్డు యు / ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా థియేటర్లకు వెళ్ళవచ్చు. సినిమా రన్ టైమ్ 2.22 గంటలే. లెంగ్త్ తక్కువ కావడం ప్లస్ అవుతుందని సెన్సార్ ఇన్‌సైడ్ టాక్. శ్రీదేవి విజయ్ కుమార్, సముద్రఖని, సాయి కుమార్, సీనియర్ నరేష్, 30 ఇయర్స్ పృథ్వీ, బ్రహ్మాజీ, 'వెన్నెల' కిశోర్ వంటి స్టార్ కాస్ట్ ఉండటం వల్ల ప్రేక్షకులకు బోర్ కొట్టే ఛాన్సులు తక్కువ అట.

'బ్యాడ్ బాయ్ కార్తీక్' కథ కమామీషు ఏమిటి?కార్తీక్ (నాగశౌర్య)ది వైజాగ్. విదేశాలు వెళ్లాలనే ప్లానులో ఉంటాడు. సరిగ్గా ఆ టైంలో డీఎస్పీ (సాయి కుమార్) కూతురు (విధి యాదవ్)తో పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. తర్వాత సమస్యల్లో కూడా! అసలు వాళ్ళ సమస్యలకు కారణం ఏమిటో తెలుసుకోవాలని ట్రై చేస్తున్న టైంలో సిస్టర్ (శ్రీదేవి విజయ్ కుమార్) పెద్ద ప్రమాదంలో ఉందని తెలుస్తుంది. అక్కను కాపాడటం కోసం తమ్ముడు ఏం చేశాడు? బద్ద శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల నుంచి అక్కను, ఓ ఊరిని ఎలా కాపాడాడు? అనేది కథ అని తెలిసింది.

Continues below advertisement

Also Read: Thimmarajupalli TV Twitter Review - 'తిమ్మరాజుపల్లి టీవీ' ట్విట్టర్ రివ్యూ: నిర్మాతగా కిరణ్ అబ్బవరం హిట్టు కొట్టాడా? ప్రీమియర్స్ టాక్ ఏంటి?

పక్కా కమర్షియల్ మీటర్‌లో కార్తీక్... కష్టమేనా!?సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పక్కా కమర్షియల్ మీటర్‌లో 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సాగిందని తెలిసింది. లవ్ ట్రాక్ నుంచి కామెడీ సీన్స్ వరకు ఇప్పటికే పలు సినిమాల్లో చూసిన సూపర్ హిట్ ఫార్ములాను ఫాలో అవ్వడంతో రొటీన్ ఫిల్మ్ అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుందట.

Also ReadPrasad Behara: మీవి కన్నీళ్లు... నావి *చ్ఛ కాదు - పాపం ప్రసాద్ బెహరా, ఎమోషనల్ స్పీచ్ వెనుక కారణం ఏమిటంటే?

హీరోగా నాగశౌర్య మెరిసినప్పటికీ... యాక్షన్ సీన్లు వరకు బావున్నా, కథ అండ్ స్క్రీన్ ప్లేలో పట్టు లేకపోవడం మైనస్ అవుతుందని ఇన్ సైడ్ టాక్. యాక్షన్ సీక్వెన్స్, కొన్ని కామెడీ సీన్స్ బాగా తీశారట. సినిమా చూశాక నాని సూపర్ హిట్ సినిమా ఒకటి, ఆ మధ్య నితిన్ హీరోగా నటించిన ఫ్లాప్ మూవీ మరొకటి గుర్తుకు వచ్చే ఛాన్సులు ఎక్కువ అని టాలీవుడ్ టాక్. హ్యారీస్ జయరాజ్ సాంగ్స్ సౌండ్ చేయడం లేదు. అది మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి, ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఓపెనింగ్స్ రావడం కష్టంగా కనబడుతోంది.

Also ReadPurple Halcyon: ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్‌తో నెలకు కోటి సంపాదించిన కేరళ కుట్టి... ఇప్పుడు ఏమైందో తెలుసా?