Avatar Actor Jack Slefie With Tollywood Heroes : ప్రస్తుతం సోషల్ మీడియాలో 'అవతార్ 3' మేనియా నడుస్తోంది. హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో ఈ విజువల్ వండర్ వరల్డ్ వైడ్‌గా ఈ నెల 19న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ AI వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Continues below advertisement

టాలీవుడ్ టాప్ హీరోలతో...

అవతార్ హీరో జేక్ సల్లీ టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో నేరుగా సెల్ఫీ దిగడం, వారితో సెల్ఫీ దిగిన టైంలో ఆ మూవీకి సంబంధించి బీజీఎం ప్లే కావడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. 'వారణాసి' సెట్‌లో రుద్ర (మహేష్ బాబు)తో పాటు 'అఖండ 2'లో బాలయ్య. 'పుష్ప 2'లో అల్లు అర్జున్, 'మగధీర'లో రామ్ చరణ్, 'కేజీఎఫ్' యష్, బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, 'రోబో'లో రజనీ కాంత్, 'బాహుబలి'లో ప్రభాస్, రానా, 'సలార్‌'లో ప్రభాస్, 'విక్రమ్' మూవీలో కమల్ హాసన్, 'కాంతార'లో రిషబ్ శెట్టి, 'దేవర'లో ఎన్టీఆర్, 'RRR'లో రామ్ చరణ్ ఇలా అందరితో సెల్ఫీ దిగడం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ AI వీడియో ట్రెండ్ అవుతుండగా... ఇది మరో విజువల్ వండర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Continues below advertisement

Also Read : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్

'అవతార్'తో సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతాన్నే ఆవిష్కరించారు జేమ్స్ కామెరూన్. ఈ ఫ్రాంచైజీలో భాగంగా మూడో సినిమాగా వస్తోంది 'అవతార్ ఫైర్ అండ్ యాష్'. ఫస్ట్ పార్ట్‌లో పండోరా అనే సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారు. ఆ తర్వాత 'అవతార్ ది వే ఆఫ్ వాటర్'లో నీరు ప్రధానాంశంగా చూపించారు. ఇక మూడో పార్టులో అగ్ని బ్యాక్ డ్రాప్‌గా చూపించనున్నారు.