Actress Nivetha Thomas Angry About AI Morphing Images : ప్రెజెంట్ ఏఐ ట్రెండ్ నడుస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోస్, వీడియోలు ఎక్కువయ్యాయి. రీసెంట్‌గా టాలీవుడ్ హీరోయిన్లు, సెలబ్రిటీల ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. వారి ఫోటోలను ఒరిజినల్ ఫోటోస్ అనేలా అసభ్యంగా మారుస్తూ సైకోల రీతిలో ప్రవర్తిస్తున్నారు. రీసెంట్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీల ఫోటోలను మార్ఫింగ్ చేయగా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా, హీరోయిన్ నివేదా థామస్ ఫోటోలను సైతం మార్ఫింగ్ చేశారు.
నివేదా స్ట్రాంగ్ వార్నింగ్
తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై నివేదా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా చూస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'నా ఫోటోలను AI ద్వారా మార్ఫింగ్ చేసి రూపొందించిన చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేయడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఫోటోలు, కంటెంట్ సృష్టించడం, షేర్ చేయడం తీవ్ర కలత పెట్టేది.
ఇది ఆమోద యోగ్యం కానిది. చట్ట విరుద్దం. డిజిటల్ పరంగా నా ప్రైవసీకి తీవ్ర భంగం కలిగిస్తుంది. నేను దీన్ని రికార్డు చేస్తున్నా. ఈ పని చేసిన వారి అకౌంట్స్ సహా బాధ్యులు వెంటనే అలాంటి కంటెంట్ తొలిగించాలి. లేకుంటే వారిపై చర్యలు తీసుకునేలా చేస్తాను. ఇలాంటి కంటెంట్ ఎవరూ షేర్ చెయ్యొద్దు.' అంటూ రాసుకొచ్చారు.
Also Read : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
యంగ్ బ్యూటీ శ్రీలీల సైతం సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, మార్ఫింగ్ వీడియోస్, చెత్త కంటెంట్‌పై ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రతీ నెటిజన్‌కు చేతులెత్తి అభ్యర్థిస్తున్నానని... ఏఐ సాయంతో సృష్టించే చెత్తకు సపోర్ట్ చెయ్యొద్దంటూ రిక్వెస్ట్ చేశారు. 'టెక్నాలజీని మంచి కోసం వాడడం వేరు. అసభ్యత కోసం వాడడం వేరు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల జీవితం సులభమవ్వాలి. అంతే తప్ప క్లిష్టంగా మారకూడదు.
ప్రతీ అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, మనవరాలు, సోదరి, స్నేహితురాలు, సహోద్యోగి అయి ఉంటారు. కళను వృత్తిగా స్వీకరించి ఉండొచ్చు. ఇండస్ట్రీలో రక్షణతో కూడిన వాతావరణం ఉంటుందన్న నమ్మకం ఇవ్వాలి. నాకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆన్‌లైన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నా. అలాంటి కొన్నింటిన నా సన్నిహితులు నా దృష్టికి తెచ్చారు. నా తోటి నటీమణులు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవడం చూస్తున్నా. వారందరి తరఫున నేను మీ ముందుకు వచ్చా. ప్రేక్షకులపై నాకు గౌరవం, నమ్మకం ఉన్నాయి. అందుకే మాకు అండగా నిలబడాలని రిక్వెస్ట్ చేస్తున్నా.' అంటూ రాసుకొచ్చారు.