Adivi Sesh's Dacoit Movie Teaser Out Now : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'. షానీల్ డియో దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
నాగ్ ఫేమస్ సాంగ్‌తో...
కింగ్ నాగార్జున 'కన్నెపిట్టరో కన్ను కొట్టరో' సాంగ్ బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చిన టీజర్ అదిరిపోయింది. ఇప్పటివరకూ చూడని ఓ డిఫరెండ్ లుక్, ఖైదీ రోల్‌లో అడివి శేష్ కనిపించనున్నారు. టీజర్ ఎంట్రీలోనే హీరో హీరోయిన్లు ఓ కారులో వెళ్తూ.. యాక్షన్ సీక్వెన్స్ చూపించడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. 'నేను ఓ దొంగని' అంటూ శేష్ చెప్పడం ఆసక్తికరంగా ఉంది.
Also Read : తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీ - లెజెండరీ ప్రొడ్యూసర్ బి నాగిరెడ్డి... ఈ బుక్ చదవండి మీకు తెలుస్తుంది
మూవీలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌లతో పాటు ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, అతుల్ కులకర్ణి, సునీల్, అనురాగ్ కశ్యప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఇద్దరు మాజీ లవర్స్ మధ్య జరిగిన ఘటనలే ఈ మూవీ అని తెలుస్తోంది.