Prabhas The Raja Saab's Sahana Sahana Song Lyrics : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి రొమాంటిక్ మెలోడి 'సహనా సహనా నా సఖి సహనా' సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో ప్రభాస్, నిధి అగర్వాల్ డ్యాన్స్ అదిరిపోయింది. కూల్ లవ్ లిరిక్స్ విత్ రొమాంటిక్ టచ్‌తో ఆకట్టుకుంటున్నాయి. యూరప్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి.
ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా... తమన్, విశాల్ మిశ్రా, శృతి రంజనీ పాడారు. తమన్ బీజీఎం అదిరిపోయింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, ఫస్ట్ 'రెబల్ సాబ్' సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా... వాటిని మించి రొమాంటిక్ సాంగ్ ట్రెండ్ అవుతోంది. ఈ పాట లిరిక్స్ ఓసారి చూస్తే...
'సహనా సహనా' సాంగ్ లిరిక్స్
పల్లవి
సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూశానా...
సహనా సహనా అతిశయ సుగుణా మనసే నీకే రాశానా...
తోడు లేక నిన్నా మొన్నా కుదురుగ వేచున్నా...
ఎదురుగ నువ్వే వచ్చేశాక తిథులిక చూసేనా...
నా వధువిక నువ్వే అంటూ నేనే ముడులను వేశానా...
శరత్ చంద్రిక తేజ యామినీ... నిలోత్పలనివే మందగామినీ
ప్రమద్దీపికా హంస భామిని కదిలే దేవత స్త్రీవే...
శరత్ చంద్రిక తేజ యామినీ... నిలోత్పలనివే మందగామినీ
ప్రమద్దీపికా హంస భామిని కదిలే దేవత స్త్రీవే...
చరణం 1
చనువిచ్చే లోపలే వచ్చేశావే భామ... ఇది శుభమా శుభమా
అన్నీ నేరుగా పంచేశావు లేమ్మా... చెరిసగమే సగమా...
నీలో ఇంతలో ఎంత మారెనమ్మా... అరె వినుమా వినుమా...
ఏమైపోయినా ఎంత మారినా నీతో ఉంటానమ్మా...
శరత్ చంద్రిక తేజ యామినీ... నిలోత్పలనివే మందగామినీ
ప్రమద్దీపికా హంస భామిని కదిలే దేవత స్త్రీవే...
శరత్ చంద్రిక తేజ యామినీ... నిలోత్పలనివే మందగామినీ
ప్రమద్దీపికా హంస భామిని కదిలే దేవత స్త్రీవే...
ఓ సత్యభామ... నువ్వే నువ్వే సత్యభామ...
ఓ సత్యభామ... నువ్వే నువ్వే సత్యభామ...
ఓ సత్యభామ... నువ్వే నువ్వే సత్యభామ...
Also Read : తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీ - లెజెండరీ ప్రొడ్యూసర్ బి నాగిరెడ్డి... ఈ బుక్ చదవండి మీకు తెలుస్తుంది
స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తుండగా... ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటే బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే, సప్తగిరి, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్‌లో నటిస్తుండగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన వింటేజ్ లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 9న పాన్ ఇండియా లెవల్‌లో మూవీ రిలీజ్ కానుంది.