Shah Rukh Khan Vijay Thalapathy Movie: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’. అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ షారుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార నటించగా, విజయ్ సేతుపతి, ప్రియమణి కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఏకంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళు చేసింది. ఈ మూవీతో దర్శకుడు అట్లీ సైతం ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

  


షారుఖ్, విజయ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ


రీసెంట్ గా తన తర్వాతి  సినిమా గురించి అట్లీ కీలక విషయాలు వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో ఓ భారీ మల్టీ స్టారర్ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నట్లు వెల్లడించారు. నిజానికి ‘జవాన్’ మూవీలోనే విజయ్ అతిథి పాత్రలో కనిపిస్తారనే టాక్ వినిపించింది. కానీ, అదంతా అవాస్తవం అని తేలిపోయింది. కానీ, విజయ్ తో కలిసి నటించడం తనకు ఇష్టమేనని గతంలోనే షారుఖ్ వెల్లడించారు. అటు షారుఖ్ తో నటించడం తనకూ ఇష్టమేనని విజయ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఓ హాలీవుడ్ సంస్థతో ఓ సినిమా చేయబోతున్నట్లు అట్లీ తెలిపారు. ఆ సినిమాలో నటీనటులు ఎవరు? అనే విషయాన్ని మాత్రం ఆయన రివీల్ చేయలేదు. అయితే, షారుఖ్, విజయ్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపించింది. కానీ, ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.     


స్క్రిప్ట్ వర్క్ లో అట్లీ ఫుల్ బిజీ


ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తాజాగా అట్లీ తెలిపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఈ సినిమా బడ్జెట్ కూడా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉండబోతున్నట్లు వెల్లడించారు. “రీసెంట్ గా ఓ పార్టీలో విజయ్, షారుఖ్ కలిశారు. నా సినిమాల గురించి మాట్లాడుకున్నారు. మున్ముందు మల్టీస్టారర్ మూవీ తీసే ఆలోచన ఉంటే అందులో తాము కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అందుకే వారితో కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేయాలి అనుకుంటున్నాను. నా నుంచి వచ్చే తర్వాతి సినిమా ఇదే. ఈ సినిమా రూ. 3 వేల కోట్లు వసూలు చేసే చిత్రం అవుతుందని  భావిస్తున్నాను’’ అని అట్లీ చెప్పారు.


ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అటు విజయ్ దళపతి తాజాగా ‘లియో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా సుమారు రూ.550 కోట్లకు పైగా వసూళ్లు అందుకొని తమిళంలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.


Read Also: ప్రియాంక పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? నిక్ జోనాస్​ను మధు చోప్రా అనుమానించిందా?