Ashika Ranganath About Her Role In Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి, 'బింబిసార' ఫేం వశిష్ట మల్లిడి కాంబోలో వస్తోన్న లేటెస్ట్ అవెయిటెడ్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర'. ఈ మూవీలో చిరంజీవి సరసన త్రిష నటించగా.. హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు.
ఆషికా రోల్ ఏంటంటే?
ఈ మూవీలో తన రోల్ ఏంటనేది ఆషికా రివీల్ చేశారు. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె మూవీపై ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. తాను ఈ చిత్రంలో యోధ యువరాణిగా కనిపించనున్నట్లు చెప్పారు. 'బ్లూ/గ్రీన్ మ్యాట్ సెటప్‌తో పనిచేయడం నాకు ఫస్ట్ టైం. రియల్ సెట్‌లో ఆ ఫీల్ మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ నేపథ్యం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇది చాలా సవాల్‌తో కూడుకున్నది. కానీ చిరంజీవి సర్ ప్రతీది ఈజీ చేశారు. ప్రతీ సీన్ ఎలా విజువలైజ్ చేయాలో అర్థం చేసుకునేందుకు నాకు హెల్ప్ చేశారు.' అని తెలిపారు.
ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ సినిమాను నిర్మిస్తుండగా.. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్‌గా చేస్తున్నారు. కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, కునాల్ కపూర్, జాన్వీ కపూర్ వంటి ఐదుగురు యంగ్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమ్య పసుపులేటి, ఆశ్రిత వేముగంటి నండూరి, ఈషా చావ్లా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 'రమ రామ' సాంగ్ ట్రెండ్ సృష్టిస్తుండగా.. చిరంజీవి లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.
ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్
ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'విశ్వంభర' నుంచి బిగ్ అప్డేట్ రానుందనే వార్తలు విని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. మూవీ నుంచి టీజర్ వస్తుందని అంతా భావించారు. అయితే.. అంతర్జాతీయ వేదికపై ఈ సినిమాకు సంబంధించి ఓ బుక్‌ను రిలీజ్ చేశారు ప్రొడ్యూసర్ విక్రమ్. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర నిర్మాణ సంస్థ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 'విశ్వంభర ప్రపంచం మీ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకురానుంది. ఈ పుస్తకంలో ఏం ఉందో తెలుసుకోవాలంటే వెయిట్ చేయండి.' అంటూ పేర్కొంది.
భారీగా యాక్షన్ సీక్వెన్స్
ఈ మూవీలో భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్న యాక్షన్ సీక్వెన్స్ మూవీకే హైలెట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. 13 భారీ సెట్లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని ఈ సోషియో ఫాంటసీ కోసం సృష్టించారు. వీఎఫ్ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతుండగా.. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని మూవీ టీం చెబుతోంది.
Also Read: నా మీద చేతబడి జరిగింది - షాక్ ఇచ్చిన హీరోయిన్ నందిని రాయ్... అందుకే అవకాశాలు రావట్లేదా?