Ashika Ranganath in Viswambhara Movie: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేం వశిష్ట దర్శకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ డ్రామా రూపొందనున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. యూవీ క్రియేషన్స్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత్ర ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తుంది. ఇక ఇందులో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్‌ హీరోయిన్‌ని పరిచయం చేసింది 'విశ్వంభర' (Viswambhara Movie)టీం. ఇందులో మరో యంగ్‌ హీరోయిన్‌ నటించబోతుంది.


ఆమె క్యూట్‌ బ్యూటీ అషికా రంగనాథన్‌. తాజాగా మూవీ టీం అషికాను మూవీ సెట్‌లోకి ఆహ్వానించింది. ఆమె పోస్టర్ రిలీజ్‌ చేస్తూ మా ఎపిక్‌ సినిమాటిక్‌ జర్ని విశ్వంభర సెట్‌లోకి అషికా రంగనాథన్ ఆహ్వానిస్తున్నామంటూ ఎక్స్‌లో అధికారిక ప్రకటన ఇచ్చింది. ప్రస్తుతం అషికా పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా అషికా చివరగా నాగార్జున సరసన 'నా సామిరంగ' చిత్రంలో నటించింది. ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా మెగాస్టార్‌ సినిమాలోనే చాన్స్‌ కొట్టేసింది. ఇక యంగ్‌ హీరోయిన్ అయ్యుండి వరుసగా సీనియర్‌ హీరోలతో ఈ భామ జతకడుతూ బ్యాక్ టూ బ్యాక్‌ ఆఫర్స్‌ కొట్టేస్తుంది. 






కాగా విశ్వంభర మూవీకి ఆస్కార్‌ విన్నర్‌ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌ మూవీ విశ్వంభర కాన్సెప్ట్‌ వీడియో రిలీజ్‌ చేసి ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నారు. ఇక ఈసినిమా షూటింగ్‌ జూలై కల్లా పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ను మొదలు పెట్టానున్నారట. విశ్వంభరం మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సోషియో ఫాంటసిగా వస్తున్న ఈ సినిమాను డైరెక్టర్‌ వశిష్ట అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారట.


Also Read: Sitara : అమ్మానాన్న కాకుండా ఆ ఇద్దరు హీరోయిన్స్‌ అంటే ఇష్టం - ఖలేజా మూవీలోని ఆ పాత్ర చేయాలని ఉంది, సితార కామెంట్స్


ఇందుకోసం తన సినిమాటిక్‌ యూనివర్సల్‌ కొంత ప్రపంచాన్నే క్రియేట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో  సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కి పెద్దపీట వేసి విజువండర్‌గా విశ్వంభరను తీర్చిదిద్దుతున్నారట. మొత్తానికి విశ్వంభరతో అద్భుతమైన క్వాలిటీ విజువల్స్ ప్రేక్షకులకు అందించనున్నారట. చివరిగా విశ్వంభర షెడ్యూల్‌ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, త్రిషలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. ఇందుకోసం హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో భారీ సెట్‌ కూడా వేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను సుమారు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌ కేటాయించినట్టు సమాచారం. ‌