మైథాలజీ, డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అందుకని ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆ తరహా ఫిలిమ్స్ చేస్తున్నారు. తెలుగులో నటి అర్చనా శాస్త్రి (Archana Shastry) అటువంటి సినిమా చేస్తున్నారు. ఆ మూవీ పేరు 'కర్మ స్థలం'.
నాకూ 'కర్మ స్థలం' తరహా సినిమా చేయాలనుంది - ఆకాష్ పూరిఅర్చనా శాస్త్రి (వేద) ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'కర్మ స్థలం'ను రాయ్ ఫిల్మ్స్ పతాకం మీద శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మిస్తున్నారు. మిథాలీ చౌహాన్, వినోద్ అల్వా, 'కాలకేయ' ప్రభాకర్, 'బలగం' సంజయ్, నాగ మహేష్, 'దిల్' రమేష్, 'చిత్రం' శ్రీను ఇతర ముఖ్య తారాగణం. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుందీ సినిమా. ఆకాష్ పూరి ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
'కర్మ స్థలం' మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన తర్వాత ఆకాష్ పూరి మాట్లాడుతూ... "ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. మోషన్ పోస్టర్ కూడా! నేను అమ్మవారి భక్తుడిని. అమ్మవారి మీద సినిమా రావడం సూపర్ ఎగ్జైటింగ్. 'హనుమాన్', 'కార్తికేయ 2', 'కాంతార'... ఇటీవల ఇటువంటి సినిమాలను ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. నేను కర్మను నమ్ముతా. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు జరుగుతుందని నమ్ముతా. ఇలాంటి కథ చేయాలని నాకు ఉంది'' అని అన్నారు.
Also Read: మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా
నిర్మాత యువరాజ్ మాట్లాడుతూ... ''నేను పుణె నుంచి వచ్చా. ఎనిమిది నెలల క్రితం రెండు లైన్స్ స్టోరీ విన్నా. చాలా బాగా నచ్చింది. సనాతన ధర్మం గురించి చెప్పే చిత్రమిది. రాకీ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఈ సినిమా కోసం 100 పర్సెంట్ ఇచ్చాడు" అని అన్నారు. దర్శకుడు రాకీ మాట్లాడుతూ... ''ప్రతి పండుగ వెనుక ఒక హిస్టరీ, వార్ ఉంటాయి. మా 'కర్మ స్థలం'లో మహిషాసుర మర్ధిని గురించి చెప్పాను'' అని అన్నారు.
నటుడు సతీష్ సరిపల్లి మాట్లాడుతూ... ''కర్మ స్థలం' కన్నా ముందు 'కుంభ స్థలం' చేశాం. అయితే ఆ సినిమా దీని తర్వాత వస్తుంది. నేను ఈ సినిమాలోకి ఎంట్రీ అయినప్పుడు చాలా చిన్న ప్రాజెక్ట్. రాకీకి ఇది మొదటి సినిమా అయినా విజువల్స్ పరంగా చూస్తే... దీనిని ఒక పెద్ద సినిమాలా తీశారు. ఇందులో రాకీ గారు కూడా మంచి రోల్ చేశారు'' అని అన్నారు. హీరోయిన్ మిథాలీ చౌహాన్ తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. నటుడు క్రాంతి కిల్లి మాట్లాడుతూ... "ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. కొన్ని సినిమాలు మన సనాతన ధర్మం, హిందూ ధర్మం గొప్పతనాన్ని చెప్పాయి. ఇదీ ఆ కోవలో చేరే సినిమా'' అని అన్నారు.