''మహిషాసుర మర్దిని కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. ఇటువంటి అద్భుతమైన సినిమాలో నటించడం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది'' అని హీరోయిన్ అర్చనా శాస్త్రి (Archana Shastry) అన్నారు. ఆవిడ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'కర్మ స్థలం' (Karma Sthalam Movie). రాయ్ ఫిల్మ్స్ పతాకం మీద శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మిస్తున్నారు. రాకీ షెర్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మితాలి చౌహాన్, వినోద్ అల్వా, 'కాలకేయ' ప్రభాకర్, 'బలగం' సంజయ్, నాగ మహేష్, 'దిల్' రమేష్, 'చిత్రం' శ్రీను ముఖ్య తారాగణం. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు.


'కర్మ స్థలం' ఫస్ట్ లుక్ పోస్టర్, ఆ పోస్టర్‌ డిజైన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అర్చన లుక్, గెటప్ హైలెట్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్‌లోని అమ్మవారి షాడో థియేటర్లలో పూనకాలు తెప్పించే స్థాయిలో ఉంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ సినిమా మీద బజ్ క్రియేట్ చేసింది. 






'కర్మ స్థలం' ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో అర్చన మాట్లాడుతూ... ''మంచి కథతో రూపొందిన చిత్రమిది. నాకు రాకీ కథ చెప్పినప్పుడు కొత్త వ్యక్తి గనుక ఎలా తీస్తారోనని అనుకున్నా. కథను ఎంత అద్భుతంగా నెరేట్ చేశారో... అంతే చక్కగా తెరకెక్కించారు. కొందరు కథ బాగా చెప్పినా తెరపైకి తీసుకు రావడంలో తడబడతారు. కానీ రాకీ అలా కాదు... నిర్మాత శ్రీనివాస్ గారి సహకారంతో అద్భుతంగా తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా కూడా సినిమా బావుంటుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే చిత్రమిది. ఈ సినిమా నా హృదయానికి ఎంతో దగ్గరైంది. ఈ ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. ఒక ఫైట్ సీక్వెన్స్ లోనిది'' అని అన్నారు.


Also Read: ఆ దర్శకుడితో సమంత చెట్టాపట్టాల్... నాగ చైతన్యతో విడాకుల తర్వాత డేటింగ్ న్యూస్ ఇలా కన్ఫర్మ్ చేసిందా?


'కర్మ స్థలం' దర్శకుడు రాకీ షెర్మన్ మాట్లాడుతూ... ''మేం ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశాం. వీఎఫ్ఎక్స్ వర్క్స్ సినిమా ఆలస్యమైంది. పాన్ ఇండియా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే చిత్రమిది. నిర్మాత శ్రీనివాస్ గారి సపోర్ట్ మరువలేను. అర్చన గారు ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమా చేశారు. ఎంఎల్ రాజా మంచి మ్యూజిక్ ఇచ్చారు'' అని చెప్పారు. నిర్మాత శ్రీనివాస్ సుబ్రహ్మణ్య మాట్లాడుతూ... ''పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునేలా మా దర్శకుడు రాకీ సినిమా చేశారు. మేం ఎంతో కష్టపడ్డాం. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా, 'దిల్' రమేష్, 'బలగం' సంజయ్ తదితరులు పాల్గొన్నారు.


Also Read'గేమ్ చేంజర్' తీగ లాగితే... 'దేవర', 'పుష్ప 2' గుట్టు బయటకు వచ్చిందా? ఆ రెండు సినిమాలకూ లాభాలు రాలేదా?