Aranmanai 4 Trailer Is Out Now: తమిళంలో సక్సెస్‌ఫుల్ హారర్ ఫ్రాంచైజ్ ఏంటంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ‘అరణ్మణై’. ఇప్పటికే ఈ హారర్ ఫ్రాంచైజ్ నుంచి మూడు చిత్రాలు విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యాయి. త్వరలోనే నాలుగో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. సుందర్ సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘అరణ్మణై 3’లో కూడా రాశీ ఖాన్నా హీరోయిన్‌గా కనిపించగా.. తమన్నా మాత్రం మొదటిసారి ఈ హారర్ ఫ్రాంచైజ్‌లోకి అడుగుపెట్టింది. ‘అరణ్మణై 4’లో ఈ మిల్కీ బ్యూటీ దెయ్యంగా మారి భయటపెట్టనుందని తాజాగా విడుదలయిన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.


చెల్లెలి పాత్రలో తమన్నా..


తాజాగా విడుదలయిన ‘అరణ్మణై 4’ ట్రైలర్.. ఈ ఫ్రాంచైజ్‌లో తెరకెక్కిన మూడు చిత్రాలను గుర్తుచేస్తోంది. ముందుగా ట్రైలర్ ఓపెన్ అవ్వగానే తమన్నా, సంతోష్ ప్రతాప్ ఒక హ్యాపీ కపుల్‌లాగా కనిపిస్తారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. కానీ వారిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని, అందుకే తమన్నా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటూ ఒక వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. బావిలో తమన్నా ఉరి వేసుకొని చనిపోయినట్టుగా చూపిస్తారు. ఇక ‘అరణ్మణై 4’లో తమన్నాకు అన్నయ్య పాత్రలో దర్శకుడు సుందర్ సి రంగంలోకి దిగాడు. తన చెల్లెలు ఆత్మహత్య చేసుకోలేదని నమ్మి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు.


ఆత్మహత్య కాదు..


‘అరణ్మణై 4’ ట్రైలర్‌లో తమన్నాది నిజంగానే ఆత్మహత్య కాదని, ఏదో జరిగిందని హింట్ ఇచ్చారు. ఇక ఏం జరిగిందో పూర్తి కథ తెలియాంటే సినిమా చూడాల్సిందే అన్నట్టుగా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. ఈ మూవీలో సుందర్ భార్యగా, తమన్నా వదినగా రాశీ ఖన్నా నటించింది. లాయర్ పాత్రలో సుందర్ కనిపించనున్నాడని ట్రైలర్‌లోని డైలాగ్‌తో క్లారిటీ వచ్చింది. ట్రైలర్‌లో భయంకరంగా ఉన్న షాట్స్ చాలానే జతచేశాడు దర్శకుడు. ఇక ‘అరణ్మణై 4’లో మరో ముఖ్యమైన పాత్రలో కనిపించాడు గరుడ రామ్. ఇందులో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. తాంత్రిక పూజలు చేసే స్వామీజీ పాత్రలో గరుడ రామ్ నటించాడు.


కమర్షియల్ ఎలిమెంట్స్‌తో..


ఇక తన హారర్ ఫ్రాంచైజ్‌లో కేవలం భయపెట్టే హారర్ సీన్స్‌ మాత్రమే కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా యాడ్ చేయడం సుందర్ ప్రత్యేకత. అందుకే ‘అరణ్మణై 4’లో కూడా తమన్నా, రాశీ ఖన్నా కలిసి ఒక పాటకు స్టెప్పులేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఈ ఇద్దరు భామల గెటప్ చూస్తుంటే ఇదొక ఐటెమ్ సాంగ్‌లాగా ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. యోగి బాబు లేకుండా తమిళ సినిమాల్లో కామెడీ లేదు కాబట్టి ‘అరణ్మణై 4’తో కూడా ప్రేక్షకులను నవ్వించడానికి యోగి బాబు సిద్ధమయ్యాడు. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇందులో తమన్నా మాత్రమే కాకుండా బాక్ అనే పేరుతో మరో దెయ్యం కూడా ఉంటుందని తెలుస్తోంది. ‘అరణ్మణై’ ఫ్రాంచైజ్‌లోని ప్రతీ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు మేకర్స్. కానీ ‘అరణ్మణై 4’ తెలుగు రిలీజ్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.



Also Read: సందీప్‌ కిషన్‌ 'వైబ్‌' ఫస్ట్‌లుక్‌ - అప్పుడే కొత్త సినిమా ప్రకటించిన ఈ యంగ్‌ హీరో, డైరెక్టర్‌ ఎవరో తెలుసా?