Sundeep Kishan Vibe First Look: యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆ మధ్య సినిమాలకు కాస్తా గ్యాప్‌ ఇచ్చిన ఈ హీరో 'మైఖేల్‌' అనే  పాన్‌ ఇండియా మూవీ రీఎంట్రీ ఇచ్చాడు. భారీ అంజనాలతో వచ్చిన ఈచిత్రం డిజాస్టర్‌ అయ్యింది. అయినా మూవీ ఫలితాలతో సంబంధం వరుస సినిమాలు ప్రకటిస్తున్నాడు. రీఎంట్రీలో సెకండ్‌ హీరో చాన్స్‌లు కూడా వదులుకోవడం లేదు. ఇక ఇటీవల ఊరు పేరు 'భైరవకోన' చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న సందీప్‌ కిషన్‌ అప్పుడే మరో సినిమాను లైన్లో పెట్టాడు. తాజాగా తన 31వ సినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చాడు.


నేడు (మార్చి 30) #SK31 సినిమా టైటిల్‌ తో పాటుగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీం.  తాజాగా దీన్ని సందీప్‌ కిషన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు. వైబ్‌ అంటూ ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వదిలాడు సందీప్‌ కిషన్‌. ఇందులో అతడు ఫుల్‌ యాక్షన్‌ అవతార్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ ఆసక్తిని పెంచుతుంది. ఇక ఇందులసందీప్  చేతిలో ఉన్న కత్తి రక్తంతో తడిసి ఉండటం మూవీపై ఆసక్తిని పెంచుతుంది. అంతేకాదు అతడి వెనకాల ఉన్న ఫ్రెండ్స్‌ కూడా ఒళ్లంతా గాయాలు, చేతి ఆయుధాలతో కనిపించారు. సందీప్‌ కిషన్‌ #SK31 ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తుంటే ఈ మూవీ ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌ మూవీ అనే 'VIBE' ఇస్తుంది.






ఇక ఈ పోస్టర్‌ షేర్‌ చేస్తూ సందీప్‌ కిషన్‌ ఇచ్చిన క్యాప్షన్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. "'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' లాంటి సినిమా తెరకెక్కించిన టాలెంటెడ్‌ అంట్‌ ఫ్యాషనేట్‌తో టీంతో కలిసి నా తదుపరి ప్రత్యేకమైన సినిమాను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌జే స్వరూప్‌(RSJ Swaroop) నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా.. మీకు క్రేజీ నోస్టాల్జిక్ వైబ్ ను అందిస్తానని వాగ్దానం చేస్తున్నాను" అంటూ తన సినిమాను అనౌన్స్‌ చేశాడు ఈ యంగ్‌ హీరో. 


Also Read: పృథ్వీరాజ్ సుకుమారన్ 'గోట్‌ లైఫ్‌' రియల్ మ్యాన్‌ ఇతడే - ఏడారిలో మూడేళ్లుగా 700 గొర్రెతో సావాసం, చివరికి..



త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్‌ టీం వివరాలను మేకర్స్‌ ప్రకటించనున్నారు.  కాగా 'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'మసూద' చిత్రాలతో కమర్షియల్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా,  డైరెక్టర్ స్వరూప్ ఆర్‌ఎస్‌జె. తనదైన శైలిలో థ్రిల్లర్‌ చిత్రాలను తెరకెక్కించడంలో ఆర్‌ఎస్‌జే స్వరూప్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్ తో చేస్తున్న "వైబ్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరిలో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.