Malavika Manoj ‘Oh Bhama Ayyo Rama Poster Released: కేరళ బ్యూటీ మాళవిక మనోజ్ ‘జో’ సినిమాతో సౌత్ ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది. ఈ  సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో నిలిచిపోయింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. ఓ రేంజిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తన నటనతో కొన్నిసార్లు ప్రేక్షకులను కంటతడి పెట్టింది.


తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ‘జో’ బ్యూటీ మాళవిక మనోజ్


హరి హరన్ రామ్ దర్శకత్వం వహించిన ‘జో’ సినిమా మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది. రియో రాజ్, భవ్య త్రిఖ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం గతేడాది నవంబర్ 24న రిలీజ్ అయిన సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో మాళవిక మలయాళీ కుట్టి పాత్రలో కనిపించింది. ఆమె యాక్టింగ్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ నేరుగా తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ గోదల దర్శకత్వం వహిస్తున్నారు. సుహాస్‌ హీరోగా నటిస్తున్నారు. మాళవిక మనోజ్ ఆయనకు జోడీగా కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.






వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిన సుహాస్ 


ఇప్పటి వరకు వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ ఆకట్టుకుంటున్న సుహాస్, వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఆయన నటించిన పలు సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘శ్రీరంగనీతులు’ అనే సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న యువకుడిగా కనిపించారు. పోస్టర్లు, కటౌట్లు పెట్టి పాపులారిటీ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. తాజాగా సుహాస్ అభిమానులకు ‘ఓ భామ అయ్యో రామా’ సినిమాతో మరో సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ కొత్త సినిమా టైటిల్ పోస్టర్‌ సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ‘జో’ బ్యూటీ మాళవిక టాలీవుడ్ లోకి అడుగు పెడుతుండటంతో సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కూడా ‘జో’ సినిమాను మించి సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.


మాళవిక మనోజ్ కేరళలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు సౌదీ అరేబియాలోని జెడ్డాలో సెటిల్ అయ్యారు. మాళవిక మనోజ్ శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడంతో పాటు శాస్త్రీయ నృత్యకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 2012 ‘ప్రకాశన్ పరక్కట్టే’ అనే సినిమాతో కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ’జో’, ‘నాయాది’ అనే సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.


Read Also: పవర్ స్టార్ మూవీ పేరుతో నితిన్ కొత్త మూవీ, ‘తమ్ముడు‘ ఫస్ట్ లుక్ అదుర్స్