గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కొత్త సినిమా మీద దృష్టి పెట్టారు. శంకర్ దర్శకత్వంలో నటించిన 'గేమ్ చేంజర్' సినిమాలో అప్పన్న పాత్రలో ఆయన నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే, బాక్స్ ఆఫీస్ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. ఇప్పుడు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతారని మెగా వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమా మీద కొత్త గాసిప్ ఒకటి హల‌్ చల్ చేస్తోంది. అది ఏమిటో తెలుసా? 


రామ్ చరణ్ సినిమా నుంచి రెహ్మాన్ అవుట్?
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత, దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ (AR Rahman) పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆయన హైదరాబాద్ వచ్చారు. అంతే కాదు... పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత వీడియో విడుదల చేశారు. దానికి అదిరిపోయే రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశారు. కానీ సినిమాకు ఆయన మ్యూజిక్ చేయడం లేదని, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల కారణంగా రామ్ చరణ్ సినిమా నుంచి రెహ్మాన్ తప్పుకొన్నారని ప్రచారం జరుగుతోంది.


పుకార్లు నమ్మొద్దు... రెహ్మాన్ సంగీతంలోనే RC16
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా సినిమాకు 'పెద్ది' టైటిల్ (RC 16 Title Peddi) ఖరారు చేశారని సమాచారం. ఆ విషయాన్ని ఇంకా అనౌన్స్ చేయలేదు అనుకోండి. తమ సినిమాకు రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారని, పుకార్లను నమ్మవద్దని రామ్ చరణ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.


Also Read: పాక్ బెదిరింపులు లెక్కలేదు... మహా కుంభమేళాకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్, పేరు చూసి క్రిస్టియన్ అనుకోవద్దు



రామ్ చరణ్ సరసన బాలీవుడ్ యంగ్ హీరోయిన్, నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులలో కూడా పాపులర్ అయిన దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో, నటుడు జగపతి బాబు ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


Also Readమహా కుంభమేళాకు భార్యతో కలిసి వెళ్లిన టాలీవుడ్ యాక్టర్... అతను ఎవరో గుర్తు పట్టారా?