సంక్రాంతికి విడుదలైన సినిమాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన 'గేమ్ చేంజర్' (Game Changer) మీద పైరసీ ఎఫెక్ట్ ఎక్కువ పడింది.‌‌ ఒక వైపు పైరసీని అరికట్టడం కోసం చిత్ర బృందం కృషి చేస్తుంటే... మరొక వైపు ఏపీ లోకల్ టీవీలో ఆ ప్రింట్ టెలికాస్ట్ చేయడం మెగా అభిమానులకు, సామాన్యులకు షాక్ ఇచ్చింది. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి విస్మయం వ్యక్తం చేశారు.


ఏపీ లోకల్ టీవీ సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులు
'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ టెలికాస్ట్ చేసిన ఏపీ లోకల్ టీవీ సిబ్బంది మీద కంప్లైంట్ వెళ్ళింది.‌ కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ (22/2025) నమోదు చేశారు.‌ విశాఖపట్నం కమిషనర్ ఆధ్వర్యంలో గాజువాక పోలీసులు, క్రైమ్ క్లూస్ టీం కలిసి ఏపీ లోకల్ టీవీ కార్యాలయానికి వెళ్లారు.


'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ టెలికాస్ట్ చేసిన అప్పల రాజును అరెస్టు చేశారు. M/S కాఫీ రైట్ సేఫ్టీ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.వి. చలపతి రాజు నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది.


Also Readసైఫ్ అలీ ఖాన్ మీద ఎటాక్ జరుగుతుంటే కరీనా ఎక్కడ ఉంది? కత్తిపోట్ల నుంచి ఐసీయూలో సర్జరీ వరకు...






'గేమ్ చేంజర్'‌ పైరసీ కేసులో 45 మందిపై ఫిర్యాదు
థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలకు పైరసీ, సోషల్ మీడియా లీక్స్ వంటివి పెనుభూతంగా మారాయి. ప్రేక్షకులను థియేటర్లకు రానివ్వకుండా నెట్టింట క్వాలిటీతో కూడిన ప్రింట్ అందుబాటులోకి వస్తుండడం వసూళ్లకు భారీగా గండి పడుతోంది. అందులో ఇటీవల 'గేమ్ చేంజర్' మొదటి స్థానంలో ఉంటుందని‌ చెప్పాల్సిన అవసరం లేదు.‌ 


'గేమ్ చేంజర్' థియేటర్లలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్ నెట్టింట వచ్చేసింది. అంతే కాదు... 45 మంది సభ్యులతో కూడిన ఒక ముఠా సోషల్ మీడియాలో దానిని వైరల్ అయ్యేలా చేసింది. కొంత మంది నుంచి చిత్ర బృందానికి బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ సినిమా పైరసీని స్ప్రెడ్ చేయకుండా ఉండాలంటే తమకు కొంత అమౌంట్ ఇవ్వాలని అడగడంతో పాటు ఒక విధమైన హెచ్చరికలు జారీ చేశారు. దాంతో వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం ఆ 45 మంది ముఠా మీద సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది ఒకటే కాదు... సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చేసిన మిగతా జనాల మీద కూడా చిత్ర బృందం కంప్లైంట్ చేసింది.


Also Readపటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?



సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లు (ఫేస్ బుక్, ట్విట్టర్,‌ ఇంస్టాగ్రామ్,‌ యూట్యూబ్) వంటి సైట్లలో సినిమాలో క్లిప్స్ షేర్ చేయడంతో పాటు పనికట్టుకుని కొంతమంది నెగటివ్ టాక్స్ స్ప్రెడ్ చేశారు. కాపీ రైట్ యాక్ట్ కింద వాళ్ల మీద కేసులు నమోదు చేశారు.