తెలుగు తెరపై కన్నడ కథానాయికల‌ హవా ఎక్కువ. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ 'బాహుబలి', 'పుష్ప' సినిమాల్లో హీరోయిన్లు 'క్వీన్' అనుష్క శెట్టి, 'నేషనల్ క్రష్' రష్మికా మందన్నా... ఇద్దరూ కన్నడిగులు. ఇప్పుడు వాళ్ళిద్దరూ బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. 

థియేటర్లలోకి ఘాటి వర్సెస్ ది గర్ల్ ఫ్రెండ్!?Ghaati Vs The Girlfriend: అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'ఘాటి'. తొలుత ఏప్రిల్ నెలాఖరున (29న) విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ కుదరలేదు. తర్వాత జూలై 11న రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అదీ జరగలేదు. ఇప్పుడు ఆ సినిమాను సెప్టెంబర్ తొలి వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

Also Readనదివే వర్సెస్ నీవే... అదే మ్యూజిక్కు - అవే స్టెప్పులు... రష్మిక కొత్త సినిమాలో పాట కాపీయేనా!?

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ఈ సినిమాను కూడా సెప్టెంబర్ తొలి వారంలో విడుదల కానుందని టాక్. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతున్న సమాచారం ప్రకారం... ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానున్నాయి. రెండు సినిమాల మధ్య క్లాష్ తప్పేలా లేదట. 

రెండూ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్...దర్శకులు ఇద్దరికీ సినిమాలు కీలకం!!'ఘాటి' సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆయనతో మొదలైన పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా చివరకు చేతులు మారింది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తి అయ్యింది. అందువల్ల, ఆ సినిమా క్రెడిట్ పూర్తిగా ఆయనకు ఇవ్వలేం. అందుకని, 'ఘాటి'తో ఆయన సక్సెస్ కొట్టాల్సిన పరిస్థితి.

Also Readపవన్‌ కళ్యాణ్‌తో ఒక్క సినిమా... వంద సినిమాలతో సమానం - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ

'ది గర్ల్ ఫ్రెండ్' దర్శకుడు రాహుల్ రవీంద్రన్ విషయానికి వస్తే... నాగార్జున హీరోగా ఆయన తీసిన 'మన్మథుడు 2' మీద విమర్శలు వచ్చాయి. అందుకని రష్మిక సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయన మీద ఉంది. దర్శకులు ఇద్దరూ విజయం కోసం వెయిట్ చేస్తున్నారు. రెండూ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలే. ఆ రెండూ ఒకే రోజు విడుదలైతే ఎలా ఉంటుందో మరి!?