బ్లాక్ బస్టర్ 'డీజే టిల్లు'తో విమల్ కృష్ణ (Vimal Krishna) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'అనుమాన పక్షి' (Anumana Pakshi Movie). కొత్త ఏడాదిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఫిబ్రవరిలో 'అనుమాన పక్షి' విడుదల'అనుమాన పక్షి'లో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ రాగ్ మయూర్ హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఇందులో మెరిన్ ఫిలిప్ కథానాయిక. ఆల్రెడీ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు సినిమా విడుదల గురించి అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరిలో సినిమాను థియేటర్లలోకి తీసుకు రానున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాగ్ మయూర్ ఒక స్పెషల్ వీడియో చేశారు.
Also Read: Akhanda 2 Tickets Rates Hike: ఏపీలో 'అఖండ 2' బెనిఫిట్ షోలకు అనుమతి... టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే?
ఫిబ్రవరిలో విడుదల విషయాన్ని చెబుతూ రూపొందించిన స్పెషల్ వీడియోలో 'అనుమాన పక్షి'గా రాగ్ మయూర్ పాత్రను పరిచయం చేశారు. సమయం సందర్భం ఏదైనా సరే అతిగా ఆలోచించడంతో పాటు అతి జాగ్రత్త స్వభావంతో తన చుట్టుపక్కల వాళ్ళను ఆందోళన, గందరగోళానికి గురి చేసే చిత్ర విచిత్రమైన పాత్రలో రాగ్ మయూరి నటన ఆకట్టుకుంది.
రాగ్ మయూర్ హీరోగా రూపొందుతున్న 'అనుమాన పక్షి' సినిమాలో ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సునీల్ కుమార్ నామా, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి, నిర్మాతలు: రాజీవ్ చిలక - రాజేష్ జగ్తియాని - హీరాచంద్ దండ్, రచన & దర్శకత్వం: విమల్ కృష్ణ.