Ranveer Singh Apologises After Kantara Mimicry Backlash At IFFI : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ 'కాంతార' కామెంట్స్ వివాదంపై ఎట్టకేలకు మౌనం వీడారు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని అన్నారు. 

Continues below advertisement

బాధ పెట్టి ఉంటే సారీ

రీసెంట్‌గా గోవా వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI - ఇఫి) వేడుకల్లో రణవీర్ సింగ్ 'కాంతార' మూవీపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. హీరో రిషబ్ యాక్టింగ్‌ను ప్రశంసిస్తూనే... 'పంజుర్లి' దేవునికి సంబంధించిన సీన్‌ను ఇమిటేట్ చేయగా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై రణవీర్ స్పందిస్తూ... 'హీరో రిషబ్ చాలా బాగా చేశారని చెప్పడం కోసమే నేను అలా చేశాను. అలాంటి సీన్స్‌లో యాక్ట్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు.

Continues below advertisement

అలాంటి క్లిష్టమైన సీన్స్‌లో అద్భుతంగా చేయగలరు కాబట్టే ఆయనంటే నాకు చాలా ఇష్టం. మన దేశంలో ప్రతీ సంప్రదాయం, సంస్కృతి, నమ్మకాల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. నా కామెంట్స్ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నా.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Also Read : సమంత రాజ్ వెడ్డింగ్ - ఆమె చేతి రింగ్ వెరీ వెరీ స్పెషల్... ముందే హింట్ ఇచ్చారా?

అసలు ఏం జరిగిందంటే?

గోవాలో జరిగిన ఇఫి వేడుకల్లో 'కాంతార'ను ఉద్దేశించి రణవీర్ సింగ్ కామెంట్ చేశారు. 'హీరో పాత్రలోకి దెయ్యం ప్రవేశించినప్పుడు సీన్స్ చాలా బాగున్నాయి. రిషబ్ నటన అద్భుతంగా ఉంది.' అంటూ కామెంట్ చేశారు. అలాగే 'ఓ...' అనే శబ్దాన్ని స్టేజ్‌పై కామెడీగా ఇమిటేట్ చేసి చూపారు. దీనికి కన్నడీగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవ గణమైన పుంజుర్లి దేవున్ని దెయ్యం అంటూ అనడం ఏంటంటూ విమర్శలు వ్యక్తం చేశారు. హిందూ జన జాగృతి సమతి ఆయనపై ఫిర్యాదు చేసింది. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది వివాదం కావడంతో రణవీర్ ఎట్టకేలకు సారీ చెబుతూ పోస్ట్ చేశారు.