Shree Nandu's Psych Siddhartha Trailer Out Now : యంగ్ హీరో శ్రీనందు, యామినీ భాస్కర్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'సైక్ సిద్ధార్థ్' ట్రైలర్ వచ్చేసింది. టీజర్ అంత కాకపోయినా కాస్త రొమాంటిక్ టచ్, బూతు డైలాగ్స్ కొన్ని బాగానే వాడారు. ఈ మూవీకి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
లవ్, కెరీర్, బిజినెస్‌లో ఫెయిల్యూర్ అయిన ఓ సాధారణ యువకుడు చిన్న చిన్న విషయాలకే ఇరిటేట్ అవుతూ ఎదుటివారిని బూతులు తిడుతుంటాడు. అలాంటి యువకుడి లైఫ్‌లో జరిగిన పరిణామాలు, ఫ్రెండ్స్ అందరినీ పక్కా మాస్ యాంగిల్, లోకల్ లాంగ్వేజ్‌తో ట్రైలర్‌లో చూపించారు. టీజర్‌లో అంత కాకపోయినా కాస్త బూతులు బాగానే వాడారు. 'ఇటు పక్క జెఫ్ బెజోస్ ఉంటాడు. అటు పక్క ఎలాన్ మస్క్ ఉంటాడు. మధ్యలో సిద్దార్థ్ రెడ్డి' అంటూ హీరో చెప్పే డైలాగ్ సెటైరికల్ ఎలివేషన్ హైప్ చేస్తోంది.
Also Read : యాంకర్ సుమ కొడుకు రోషన్ న్యూ మూవీ 'మోగ్లీ' - ఫారెస్ట్‌లో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ట్రైలర్
ఈ మూవీ వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా... శ్రీనందు, యామినీ భాస్కర్‌లతో పాటు ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. హీరో రానా దగ్గుబాటి రానా స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్మరన్ సాయి మ్యూజిక్ అందిస్తుండగా... ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా రిలీజ్ కానుండగా... రానా స్పిరిట్ మీడియా మార్కెటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. టీజర్, కలర్ సాంగ్‌తో పాటు ట్రైలర్ కూడా ట్రెండ్ అవుతోంది.