Roshan Kanakala's Mowgli Trailer Out Now : ప్రముఖ యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా కలర్ ఫోటో ఫేం సందీప్ రాజ్ తెరకెక్కిస్తోన్న లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'మోగ్లీ'. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేస్తుండగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ వేరే లెవల్‌లో ఉంది.

Continues below advertisement

ప్రేమ కోసం హీరో వార్

'అనగనగా ఒక రాజుకు ఏడుగురు కొడుకులు. వారు వేటకెళ్లి 7 చేపలు పట్టుకొచ్చారు. అందులో ఓ చేప ఎండలేదు. చేపా చేపా ఎందుకు ఎండలేదే అని చెప్పి ఏడో కొడుకు ఆ చేపను అడిగాడు. అప్పుడు ఆ చేప ఏం చెప్పుంటది?' అంటూ ఓ స్మాల్ చందమామ స్టోరీతో ప్రారంభమైన ట్రైలర్... హీరో యాక్షన్, అడవిలో లవ్ స్టోరీతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అడవిలో సినిమా షూటింగ్ కోసం వచ్చే బ్యాచ్‌కు గైడ్‌గా ఉండే హీరో డ్యాన్స్ టీంలో ఉండే హీరోయిన్‌ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు.

Continues below advertisement

ఆమె మూగ, చెవుడు అని తెలుసుకుని ఆమెకు అండగా నిలుస్తాడు. హీరోయిన్‌పై కన్నేసిన కొందరి నుంచి ఆమెను ఎలా కాపాడాడు? తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? అనేదే మూవీ స్టోరీ అని తెలుస్తోంది. అసలు మోగ్లీ అడవిలో ఎందుకు ఉన్నాడు?, అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? హీరోయిన్ వెంట పడిన పోలీస్ ఆఫీసర్‌ను మోగ్లీ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే సస్పెన్స్‌గా చూపించారు.

Also Read : 'ద్రౌపది 2'లో సాంగ్ పాడినందుకు సింగర్ చిన్మయి క్షమాపణలు - డైరెక్టర్ రియాక్షన్... అసలు రీజన్ ఏంటంటే?

ఈ మూవీలో రోషన్ సరసన సాక్షి మహాదోల్కర్ హీరోయిన్‌గా నటించారు. ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. వీరితో పాటే బండి సరోజ్ విలన్ రోల్ చేస్తున్నారు. హర్ష చెముడు కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కలర్ ఫోటో'తో మంచి హిట్ సాధించిన సందీప్ రాజ్ నుంచి వస్తోన్న మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక 'బబుల్ గమ్'తో కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోయినా... తన యాక్టింగ్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు రోషన్. తాజా మూవీలో అడవిలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌తో ఆడియన్స్ ఆకట్టుకునేందుకు రాబోతున్నారు.