Samantha Ruth Prabhu - Raj Nidimoru Wedding Date: డిసెంబర్ 1న కథానాయిక సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. ఈ జంట కోయంబత్తూరులోని ఇషా యోగ ఆధ్యాత్మిక కేంద్రంలో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. 'భూత శుద్ధి వివాహం' చేసుకున్నారు. ఇంతకు ముందు హిందీ బుల్లితెర జంట వరుణ్ జైన్ - గియో మానిక్ జంట సైతం 'భూత శుద్ధి వివాహం' చేసుకుంది. ఈ వివాహాలు ఎక్కడ జరుగుతాయి? అసలు 'భూత శుద్ధి వివాహం' అంటే ఏమిటి? అనేది తెలుసుకోండి.
లింగ భైరవి ఆలయంలో...
సద్గురు స్థాపించిన కేంద్రంలో!
తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఇషా ఫౌండేషన్ (Isha Foundation Coimbatore)ను సద్గురు స్థాపించారు. మన భారత దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో అదొకటి. ఎక్కువ శాతం మంది యోగ నేర్చుకునేందుకు, మానసిక ప్రశాంతతకు అక్కడికి వెళతారు.
ఇషా యోగ ఆధ్యాత్మిక కేంద్రంలో లింగ భైరవి ఆలయం ఉంది. భైరవి మాతను సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆ ఆలయం 'భూత శుద్ధి వివాహాల'కు ప్రసిద్ధి. ఈ రోజు (డిసెంబర్ 1న) సమంత వివాహం సైతం ఆ ఆలయంలో జరిగింది.
'భూత శుద్ధి వివాహం' అంటే ఏమిటి?
What is Bhootha Sudhi Vivaha? సమంత పెళ్లి తర్వాత 'భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి?' అని ప్రజల్లో చర్చ మొదలైంది. ఇదొక పురాతన వివాహ ఆచారం. యోగ సంప్రదాయం నుంచి వచ్చింది. సద్గురు స్థాపించిన ఇషా ఫౌండేషన్ ఈ వివాహాలను నిర్వహిస్తోంది.
నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు... పంచభూతాలు తెలుసు కదా! పంచ భూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే 'భూత శుద్ధి వివాహం'. ఈ క్రతువులో వధూవరుల దేహాల్లోని పంచ భూతాలను శుద్ధి చేస్తారు. స్త్రీ పురుషుల మధ్య మానసికంగా, భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని లక్ష్యం. ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన భౌతిక బంధాన్ని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం.
ఉచ్ఛ్వాస, నిశ్వాసలకు అతీతంగా... ప్రాణ - మరణ భయాలకు, ఆందోళనలకు దూరంగా... భావోద్వేగ ఆలోచనలకు తావు లేకుండా... లింగ భైరవి అనుగ్రహంతో నిర్వహించే వివాహ క్రతువు 'భూత శుద్ధి వివాహం'. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లేదా ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో ఈ వివాహ క్రతువు నిర్వహిస్తారు. సమంత వంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సామాన్యులు సైతం ఈ పద్ధతిలో వివాహాలు చేసుకుంటున్నారు.
Also Read: ఎవరీ రచితా రామ్? 'కూలీ'లో విలన్‌గా సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్... మహానటిని మించిన అపరిచితురాలు