Pasupathy's Kuttram Purindhavan Telugu Trailer Out : ఓ అమ్మాయి మిస్సింగ్... దాని వెనుక ఉన్నది ఎవరు?. తన బిడ్డను కాపాడుకునేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? ఈ బిడ్డను కాపాడడానికి అమ్మాయి మిస్సింగ్ వెనుక ఉన్న లింక్ ఏంటి?... ఇదీ లేటెస్ట్ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ (కుట్రమ్ పురింధవన్ ట్రైలర్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ప్రశ్నలు. ఈ సిరీస్ త్వరలోనే ఓటీటీలోకి రానుంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'కుట్రమ్ పురింధవన్' సిరీస్ ఈ నెల 5 నుంచి ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలోనూ అందుబాటులోకి రానుంది. సిరీస్‌లో పశుపతి, విదార్థ్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటే లిజ్జీ ఆంటోనీ, లక్ష్మీ ప్రియ చంద్రమోళి, అజిత్ కోషీ, మున్నార్ రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు సెల్వమణి దర్శకత్వం వహించగా... సెల్వమణి మునియప్పన్ నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
ఓ గ్రామానికి చెందిన మెర్సీ అనే అమ్మాయి మిస్ కావడం కలకలం రేపుతుంది. ఆ అమ్మాయి పేరెంట్స్ వెతుకుతుండగా ఓ ప్రదేశంలో స్పృహ లేకుండా పడి ఉంటుంది. ఆమెపై ఎవరో అత్యాచారం చేసిన ఆనవాళ్లు ఉంటాయి. ఆ చిన్నారి పక్కింట్లో పైన ఉండే భాస్కర్‌ను పోలీసులు విచారిస్తారు.
ఇదే టైంలో భాస్కర్ కొడుకు బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అందుకు డబ్బు అవసరం కాగా త్వరలోనే అతను రిటైర్ కానుండడంతో లోన్ పుట్టదు. దీంతో అతను ఏం చేశాడు? అసలు మిస్ అయిన ఆ చిన్నారికి భాస్కర్‌కు ఏంటి సంబంధం? మెర్సీని చంపిన హంతకుడు ఎవరు? పోలీసులు ఎలా ఈ కేస్ సాల్వ్ చేశారు? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
Also Read : సమంత రెండో పెళ్లి రూమర్స్! - రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్... ఆ వార్తల్లో అసలు నిజం ఏంటంటే?