Prabhas Spirit OTT Update: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, మన 'బాహుబలి' ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాల్లో 'స్పిరిట్' ఒకటి. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటీవల పూజతో సినిమా స్టార్ట్ చేశారు. కొబ్బరి కాయ కొట్టారో లేదో ఓటీటీ డీల్ గురించి అప్డేట్ వచ్చింది. సారీ సారీ కొబ్బరి కాయ కొట్టడానికి ముందు ఓటీటీ రైట్స్ అమ్మేశారు. అదీ ఎంతకో తెలుసా?

Continues below advertisement


స్పిరిట్ ఓటీటీ @ 160 కోట్లు!
అవును... 'స్పిరిట్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పూజ కంటే ముందు అమ్మేసినట్టు తెలిసింది. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ 160 కోట్ల రూపాయలను ఇవ్వడానికి అంగీకరించిందట. దాంతో ఇండస్ట్రీ అంతా షాక్ అవుతోంది. ఎందుకు అంటే... 


సంక్రాంతి పండక్కి థియేటర్లలోకి రావడానికి రెడీ అయిన దర్శకుడు మారుతి 'ది రాజా సాబ్'తో పాటు మరో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' మూవీ ఓటీటీ డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదు. ఆ రెండిటిలో ప్రభాస్ హీరో. ఆ రెండిటి తర్వాత రాబోయే 'స్పిరిట్' రైట్స్ సోల్డ్ అవుట్ అంటే ఆశ్చర్యమే కదా! ఒక రకంగా ఇది ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ పట్ల అటు మార్కెట్టుల్లో, ఇటు ప్రేక్షక వర్గాల్లో ఉన్న క్రేజ్ చెబుతోంది.


Also Readమాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!


'స్పిరిట్' రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యిందని టాక్. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తన సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఓ ఆరు నెలల పాటు బయటకు కనిపించవద్దని, లుక్ రివీల్ అవ్వకుండా ఉండటం కోసం జాగ్రత్తలు తీసుకోమని హీరో ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా ఒక కండిషన్ పెట్టినట్లు టాక్.


Also ReadPilla Song - Dhandoraa: లవర్ బాయ్‌గా రవికృష్ణ... మనికా చిక్కాలతో స్టెప్పులు... 'దండోరా'లో 'పిల్లా...' సాంగ్ చూశారా?