గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా రూపొందిన సినిమా 'అఖండ 2 తాండవం' (Akhanda 2 Thaandavam Movie). తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే... ఏపీలో ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. అందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. టికెట్ రేట్స్ పెంచుకోవడానికి వెసులుబాటు సైతం లభించింది. ఆ వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

'అఖండ 2' బెనిఫిట్ షో @ 600...విడుదల తేదీ నుంచి టికెట్ ఎంతంటే?Akhanda 2 benefit show tickets price: 'అఖండ 2 తాండవం' విడుదలకు ముందు రోజు రాత్రి... అంటే డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య సినిమా ప్రీమియర్ షో ప్రదర్శనకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ షో టికెట్ రేటు 600 రూపాయలుగా నిర్ణయించింది.

'అఖండ 2' విడుదల రోజు నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ. 75, మల్టీప్లెక్స్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ. 100 ప్రస్తుతం ఉన్న టికెట్ రేటుపై అదనంగా పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇంచు మించు ఇంతే రేటు పెంచే అవకాశం ఉంది.

Continues below advertisement

Also ReadBhuta Shuddhi Vivaha: భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? సమంత - రాజ్ పెళ్లి ఏ పద్ధతిలో, ఎలా జరిగిందో తెలుసా?

సనాతన ధర్మం నేపథ్యంలో...'అఖండ 2'పై భారీ అంచనాలు!'అఖండ' భారీ విజయం సాధించడంతో పాటు, ఆ సినిమాకు సీక్వెల్ కావడం వల్ల 'అఖండ 2 తాండవం' మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి మరో కారణం... ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు కావడం. 'సింహ', 'లెజెండ్', 'అఖండ'... మూడు బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'అఖండ 2'. దీనికి తమన్ సంగీతం అందించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ పతాకం మీద రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు.

Also ReadLinga Bhairavi Temple Photos: లింగ భైరవి దేవి టెంపుల్ ఫోటోలు... ఈ గుడిలోనే సమంత పెళ్లి జరిగింది