ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్ (Kavya Maran) త్వరలో ఏడు అడుగులు వేయబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అనిరుధ్ బాబాయ్ సైతం పరోక్షంగా ఆ మాట చెప్పారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... వాళ్ళిద్దరి పెళ్ళి తేదీ ఖరారు అయ్యిందట. 

Continues below advertisement

కావ్యతో అనిరుధ్ పెళ్ళి ఎప్పుడంటే?కోలీవుడ్ వర్గాల కథనం ప్రకారం... నవంబర్ రెండో వారంలో కావ్యతో అనిరుధ్ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న 'జైలర్ 2'కు అనిరుధ్ సంగీత దర్శకుడు. ఆ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. ఆ సినిమా విడుదల తర్వాత అనిరుధ్, కావ్య వివాహం జరిగే అవకాశం ఉంది.

గత ఏడాది నుంచి అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ప్రేమాయణం సాగుతోందని చెన్నై వర్గాలు నుంచి వినిపిస్తున్న సమాచారం. గతేడాది న్యూయార్క్ సిటీలో ఈ సెలబ్రిటీలు ఇద్దరూ జంటగా కనిపించడంతో ప్రేమ, పెళ్లి వార్తలకు మరింత ప్రచారం లభించింది. గతంలో ఇతర మహిళలతో ఇటువంటి ప్రేమ, పెళ్లి వార్తలు వచ్చినప్పుడు సోషల్ మీడియా వేదికగా పుకార్లను నమ్మవద్దని అనిరుధ్ కోరారు. సదరు పుకార్లపై స్పందించారు. అయితే... తాజా పరిణామాలు మళ్లీ వీళ్ళిద్దరి పెళ్ళి చర్చకు దారి తీశాయి.

Continues below advertisement

Also Read: Vishnu Priya Bhimeneni - సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్

అనిరుధ్ రవిచందర్ బాబాయ్, కోలీవుడ్ నటుడు వై.జి. మహేంద్రన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'అనిరుధ్ పెళ్లి త్వరలో జరుగుతుంది' అని హింట్ ఇచ్చారు. ఆ ఒక్క మాట చెప్పారు తప్ప... పెళ్ళి కుమార్తె ఎవరు? అనే విషయాన్ని చెప్పలేదు. తమ ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి పేరును అధికారికంగా వెల్లడించలేదు.

Also ReadArya Criminal Case - హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?

ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఆయన వెరీ వెరీ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. తమిళనాడు సీఎం విజయ్ 'జన నాయకన్', రజనీ 'జైలర్ 2', లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న 'డిసి', న్యాచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్', శింబు 'అరసన్', బాలకృష్ణ 'ఎన్.బి.కె 112' తదితర చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. తమ పెళ్ళి గురించి అటు అనిరుధ్ గానీ, ఇటు కావ్య మారన్ గానీ పెదవి విప్పడం లేదు. 

Also ReadRohit Chandel Arrested - మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్