Anil Kapoor And Boney Kapoor Fight : 2005లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘నో ఎంట్రీ’. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించారు. అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్, బిపాసా బసు, ఈషా డియోల్, లారా దత్తా, సెలీనా జైట్లీ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్‌’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. 2005లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఏకంగా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది.


అనిల్ నాతో మాట్లాడ్డం మానేశారు - బోనీ కపూర్


‘నో ఎంట్రీ’ విడుదలై సుమారు 20 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సైతం అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్ నటించాలని ఇంట్రెస్ట్ ఉన్నా, మేకర్స్ మాత్రం తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గుయ్యారట. అంతేకాదు, తన అనయ్య, ఈ సినిమా నిర్మాత బోనీ కపూర్ తో మాట్లాడ్డమే మానేశారట. ఈ విషయాన్ని బోనీ కపూర్ స్వయంగా వెల్లడించారు. త్వరలో పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. “’నో ఎంట్రీ’ సీక్వెల్ తో పాటు, ఇందులో నటించే యాక్టర్ల గురించి నేను అనిల్‌కు చెప్పక ముందే సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. అప్పటికే ఈ సినిమాలో ఫలానా యాక్టర్లు నటిస్తున్నారని తెలిసింది. ఇందులో అనిల్ నటించాలి అనుకున్నారు. కానీ, ఆయనకు ఈ సినిమాలో స్పేస్ లేదు. అదే విషయాన్ని తనకు చెప్పాలి అనుకున్నాను. కానీ, తను అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికీ సరిగా మాట్లాడ్డం లేదు. త్వరలోనే పరిస్థితులు సర్దుమణుగుతాయి. మళ్లీ అందరం కలిసిపోతాం అని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.    


ఈ సినిమాలో ఆ ముగ్గురిని ఎందుకు సెలెక్ట్ చేశామంటే ? - బోనీ కపూర్


’నో ఎంట్రీ 2’ సినిమాలో వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలు పోషితున్నారు. ఈ విషయాన్ని బోనీ కపూర్ కన్ఫామ్ చేశారు. వారిని ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో వెల్లడించారు. “వరుణ్, అర్జున్ మంచి స్నేహితులు. కథకు వారు బాగా సూట్ అవుతారని భావించాను. దిల్జిత్ కు కూడా మంచి గుర్తింపు ఉంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాం. అందుకే, ఈ ముగ్గురిని ఎంపిక చేశాం అని తెలిపారు. ‘నో ఎంట్రీ 2’ సినిమా డిసెంబర్ 2024లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం బోనీ కపూర్ నిర్మాణంలో తెరకెక్కిన అజయ్ దేవగణ్ ‘మైదాన్’ మూవీ విడుదలకు రెడీ అవుతోంది.   


Read Also : ఫ్యాన్స్‌ ను ఖుషీ చేస్తున్న ‘పుష్ప 2’ అప్డేట్ - టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్