ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'ఆంధ్రా కింగ్ తాలూక'. పల్లెటూళ్లలో హీరోల అభిమానులకు ఎటువంటి ఎమోషన్స్ ఉంటాయి? వాళ్ళు ఏం చేస్తారు? వంటి యూనిక్ కాన్సెప్ట్ తీసుకుని 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇందులో కొత్త సాంగ్ త్వరలో రిలీజ్ కానుంది.
అక్టోబర్ 31న 'చిన్న గుండెలో'Andhra King Taluka Release Date: 'ఆంధ్ర కింగ్ తాలూకా' నవంబర్ 28న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఆల్రెడీ ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్‌కు వచ్చిన స్పందన పట్ల చిత్ర బృందం సంతోషంగా ఉంది. ముఖ్యంగా 'నువ్వుంటే చాలే...' పాటతో రామ్ పోతినేని గేయ రచయితగా మారారు. ఆ పాటకు ఛార్ట్ బస్టర్ అయ్యింది. రెండో పాట 'పప్పీ షేమ్'ను రామ్ స్వయంగా పాడారు. దానికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది టీం.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
'ఆంధ్ర కింగ్ తాలూకా' మేకర్స్ ఈ రోజు థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. 'చిన్ని గుండెలో...' అంటూ సాగే ఈ పాటను అక్టోబర్ 31న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే... రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంట క్లాసిక్ లవ్ మూమెంట్ బావుంది.
Also Read: 'కాంతార'లో ఆ రోల్ మేకప్‌కు 6 గంటలు... మాయావి కాదు... రిషబ్ శెట్టే - మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ!
Andhra King Taluka Cast And Crew: రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర సూపర్ స్టార్‌గా కనిపించనున్నారు. ఆయనది కీలక పాత్ర. ఇంకా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర కీలక తారాగణం. ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి, నిర్మాతలు: నవీన్ ఎర్నేని - రవిశంకర్ యలమంచిలి, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సమర్పణ: గుల్షన్ కుమార్ - భూషణ్ కుమార్ - టీ సిరీస్ ఫిలిమ్స్, CEO: చెర్రీ, సంగీతం: వివేక్ & మెర్విన్, ఛాయాగ్రహణం: సిద్ధార్థ నుని, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా.