Actress Jhansi Collect Waste Video: యాంకర్‌ జాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్‌గానే కాదు వెండితెరపై నటిగానూ తనదైన మార్క్‌ వేసుకుంది. ముఖ్యంగా తులసి కోకాపేట ఆంటీ పాత్రతో ఆడియన్స్‌ నవ్వించింది. ఇప్పటికీ ఈ పాత్రను ప్రేక్షకులు కలవరిస్తూనే ఉంటారు. అలా నటిగా, యాంకర్ గా, సహ నటిగా.. సినీ ఇండస్ట్రీలో పలు పాత్రలో ఒదిగిపోయి.. ప్రేక్షకులను అలరించిన ఝాన్సీ.. తన టాలెంట్ తో ఎనలేని పాపులారిటీని దక్కించుకున్నారు. బహుశా తెలుగులోని అనేక మాండలికాలను చాలా అనర్గళంగా మాట్లాడగల, ఏ పాత్రనైనా సులభంగా పోషించగల ఏకైక నటి ఆమె అని చెప్పవచ్చు.


గతంలో టెలివిజన్‌లోనూ దూసుకుపోయింది ఝాన్సీ.. రీసెంట్‌గా సలార్‌లో సహానటి పాత్రలో మెప్పించింది. అయితే తాజాగా జాన్సీ రోడ్డుపై చెత్త ఏరుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జాన్సీ ఇలా చూసి అంతా సర్‌ప్రైజ్‌ అయ్యారు. అంతేకాదు స్వయంగా ఈ వీడియోను జాన్సీనే షేర్‌ చేసింది. ఇందులో జాన్సీ చెత్త సేకరిస్తూ కనిపించింది. తనపనివాళ్లతో కలిసి రోడ్డుపై ఉన్న ఎండుగడ్డి, ఎండిపోయిన అరటి ఆకులను సేకరిస్తూ తన కారులో తరలిస్తుంది. అయితే జాన్సీ ఎందుకు ఇలా చేసిందో ఇక్కడ చూద్దాం.






సోషల్‌ మీడియాలో నటీనటులంతా హోంటూర్స్‌, గ్లామర్స్‌ ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. కానీ జాన్సీ మాత్రం కొద్ది రోజులుగా తన వీడియోలతో నెటిజన్లకు మెసేజ్‌లు ఇస్తుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా జాన్సీ వ్యర్థాలు వాటితో ఉన్న ఉపయోగాలపై వీడియోస్‌ చేస్తుంది. అందులో చెత్తను వేస్ట్‌ చేయవద్దని, అవి సరిగ్గా వాడుకుంటే అపారమైన ఉపయోగాలు ఉన్నాయని చెబుతుంది. తాజాగా చెత్త సెకరించిన జాన్సీ ఇది కొందరికి వ్యర్థాలు అయితే మరికొందరికి ఇది నిధి అని పేర్కొంది. ఈ లేటెస్ట్‌ వీడియోలో రోడ్డుపై పడి ఉన్న ఎండుగడ్డి, ఎండిపోయిన అరటి ఆకుల్ని సేకరించింది. వాటిని తన కారులో వేసి ఇంటకిఇ పట్టుకేళ్లింది.


Also Read: వరలక్ష్మి శరత్‌కుమార్‌ కాబోయే భర్తకు ఇదివరకే పెళ్లై, ఓ కూతురు కూడా ఉందా? - ఏంటి ఈ ట్విస్ట్‌‌!


ఈ వీడియో జాన్సీ ఇలా చెప్పుకొచ్చింది. ఇది కొందరికి వ్యర్థం, మరికొందరికి నిధి. ఈ ఎండు అరటి ఆకులు, ఎండుగడ్డి పీచు పడేయకండి.ఇది చెట్లకు మంచి ఎరువుగా పనిచేస్తుంది. ఈ ఎండు ఆకులు.. మొక్కలకు బాగా పనిచేస్తాయి. కొత్త ఆకులను మొలిపిస్తుంది. 'ఎండు గడ్డిని, ఆకులను కాల్చి బూడిద చేయకండి. అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయి. అవి ప్రకృతి సమతౌల్య సూత్రం' అంటూ ఆసక్తకిర విషయం చెప్పింది. ఇది చూసి జాన్సీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరికి ఉపయోగపడే మంచి విషయం చెప్పారంటూ జాన్సీని కొనియాడుతున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్య్వూలో జాన్సీ తాను యూనిసెఫ్ కి చాలా వర్క్ చేస్తూ వచ్చానని, చైల్డ్ మ్యారేజెస్ కోసం చాలా ఏళ్లు ఆ సంస్థలో వర్క్ చేశానని ఝాన్సీ చెప్పారు.