Anandi's Shivangi Teaser Unveiled: ప్రముఖ నటి ఆనంది (Anandi) లీడ్ రోల్‌లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ శివంగి (Shivangi). దేవ్‌రాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై పి.నరేష్‌బాబు నిర్మించారు. నటి వరలక్ష్మి శరత్ కుమార్, తమిళ నటుడు జాన్ విజయ్, డాక్టర్ కోయకిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే నటి ఆనంది ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రివీల్ చేయగా సినిమాపై హైప్‌ను పెంచేశాయి. నల్లలుంగీ, చొక్కాతో కాళ్లపై కాళ్లు వేసుకుని కళ్లద్దాలు ధరించి నుదిటిపై విభూతితో ఆనంది లుక్ అంచనాలు పెంచేసింది. తాజాగా.. మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. డైలాగ్స్, ఆనంది లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. పవర్ ఫుల్ వుమెన్ సెంట్రిక్ మూవీగా 'శివంగి' ఉండనుందని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


హైలెట్‌గా ఆనంది డైలాగ్స్



'శివంగి' (Shivangi) ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఆనంది ఓ గృహిణి పాత్రలో కనిపిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. 'వంగే వాళ్లు ఉన్నంత వరకూ.. మింగే వాళ్లు ఉంటారు. కానీ నేను వంగే రకం కాదు.. మింగే రకం.', 'సత్యభామ అంటే చందమామ కథలు చెప్పే బామ్మ కాదు.. ఇక్కడ బ్యూటీ నేనే.. బీస్ట్ కూడా నేనే' అంటూ ఆనంది చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 'నా జీవితంలో జరిగిన 2 ముఖ్య సంఘటనలు నన్ను వెంటాడుతున్నాయి'.. అంటూ చెప్పడం చూస్తుంటే.. ఓ గృహిణికి వచ్చిన కష్టాలు, భార్యాభర్తల మధ్య వచ్చే రెగ్యులర్ సమస్యలు డిఫరెంట్ కోణంలో చూపించినట్లు తెలుస్తోంది. భార్య రోల్‌లో ఆనందికి ఒకే రోజు వచ్చిన సమస్యలేంటి.?, వాటిని ఆమె వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కొంది. పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ ఏం చేశారు.? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.


Also Read: సెన్సిటివ్ కథాంశంతో ప్రియదర్శి లేటెస్ట్ ఫిక్షనల్ 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ' - మార్చి 14న థియేటర్లలోకి.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్.?


వరంగల్ అమ్మాయి ఆనంది


వరంగల్ జిల్లాకు చెందిన అమ్మాయి ఆనంది.. 'బస్ స్టాప్' మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తన అందం, అభినయం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. అనంతరం టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. కయల్ మూవీతో కోలీవుడ్‌లోకి ఆమె ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె పేరు కయల్ ఆనందిగా మారింది. తమిళంలో ఇప్పటివరకూ 20కి పైగా సినిమాలు చేశారు. ఆనంది చివరిసారిగా తెలుగులో నాగచైతన్య నటించిన 'కస్టడీ'లో కనిపించారు. తాజాగా.. శివంగి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.


Also Read: నటి అన్షు తలకు ఏమైంది? - 'మజాకా' ట్రైలర్ ఈవెంట్‌లో గాయంతో మన్మథుడు హీరోయిన్, డెడికేషన్ అంటే ఇదే!