Pop Singer Rihanna Pay For Ambani Pre Wedding: అంబానీ ఇంట పెళ్లి సందడి దేశమంత మారుమోగుతుంది. ముఖేష్‌-నీతూ అంబానీల రెండవ కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లీ పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ అధినేత వీరెన్‌ మార్చంట్‌ కుమార్తె రాధికతో అనంత్‌ ఏడడుగులు వేయబోతున్నాడు. ప్రస్తుతం వీరి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు గుజరాత్‌ జామ్‌నగర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ముందస్తు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రేటీలు, పారిశ్రామికవేత్తలు, దేశవిదేశాలకు చెందిన ప్రధానులు, మాజీ ప్రధానులతో పాటు పలు దిగ్గజ కంపెనీల సీఈఓలు హజరుకానున్నారు. 


స్వీడన్‌ మాజీ ప్రధానీ కార్ల్‌ బిల్డ్‌, కెనడా ఆబజీ ప్రధాని స్టీఫెన్‌ హార్పర్‌, బోలీవియా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ క్విరోగా, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్‌ రూడ్‌, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ చైర్‌పర్సన్స్‌ క్లాస్‌ వంటి దిగ్గజాలతో పాటు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ఆనంత్‌-రాధిక వెడ్డింగ్‌కు హజరుకానున్నారట. నేడు జరిగే ఈ ప్రీవెడ్డింగ్‌లో వరల్డ్‌ సెన్సేషన్‌, అమెరికా పాప్‌ సింగర్‌ రిహాన్నా తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకోనుంది. ఈ మేరకు ఆమె గురువారమే తన టీంతో జామ్‌నగర్‌ చేరుకుంది. ఆ సమయంలో తన లగేజ్‌ చూసి అంతా షాక్‌ అయ్యారు. భారీ క్రేన్స్‌తో రిహాన్నా లగేజ్‌ తరలించడం చూసి అంతా అవాక్కయ్యారు.  


భారీ క్యాస్ట్యూమ్స్‌తో దిగిన రిహాన్నా పర్ఫామెన్స్‌ ఏ రేంజ్‌లో ఉండబోతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అంబానీ కుటుంబంలో రిహాన్నా చెల్లించే డబ్బు ఎంత అనేది ఆరా తీశారు నెటిజన్లు. ఈమెకు చెల్లించే అమౌంట్‌ తెలిసి అంతా కంగుతింటున్నారు. ప్రీవెడ్డింగ్‌లో ఆమె ఇచ్చే పర్ఫామెన్స్‌ కోసం అంబానీ కుటుంబం ఆమెకు సుమారుగా 8 నుంచి 9 బిలియన్‌ డాలర్లు చెల్లిస్తున్నట్టు సమాచారం. అంటే ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ. 66 కోట్ల నుంచి రూ. 74 కోట్లు. రిహాన్నాతో పాటు పలువురు సింగర్స్‌ సైతం ఈ ప్రీవెడ్డింగ్‌లో తమ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకొనున్నారట. కాగా ఈ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. 






2500 రకాల వంటకాలు


మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రీవెడ్డింగ్‌ వేడుక కోసం అంబానీ ఫ్యామిలీ భారీగా ప్లాన్‌ చేసిందట. ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిరథ మహరథుల కోసం  ఘుమఘమలాడే వంటకాలను వడ్డించనున్నారు. సుమారు 2500 రకాల వంటకాలతో ఆశ్చర్యపరచునున్నారట. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 25 మంది చెఫ్‌(Chef)ల బృందాన్ని జామ్‌నగర్‌కు రప్పించారు. దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకాలతోపాటు ఇండోర్ ఫుడ్‌కు ప్రాధాన్యమివ్వనున్నారు.


పార్సీ నుంచి థాయ్ వరకు, మెక్సికన్ నుంచి జపనీస్ వరకు అన్ని రకాల వెరైటీలు సిద్ధం చేశారు. అంతేకాకుండా వచ్చే అతిథులకు ఏమైనా స్పెషల్ వంటకం కావాల్సి వస్తే చిటికెలో అందించి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య అతిథుల ఆహార అవసరాలకు అనుగుణంగా మెనూ సిద్ధం చేశారు. ఇలా ప్రపంచమంతా ఈ పెళ్లి గురించే మాట్లాడుకునేలా అంబానీ ఫ్యామిలీ అనంత్‌-రాధికల వెడ్డింగ్‌ను భారీగా ప్లాన్‌ చేశారట. ఇందుకోసం దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.