తెలుగు టీవీ ఆడియన్స్‌లో అమర్ దీప్ చౌదరి (Amardeep Chowdary)కి మంచి ఫాలోయింగ్ ఉంది. టీవీ సీరియల్స్ చేయడంతో పాటు రియాలిటీ షోస్ అతడికి పేరు తెచ్చాయి. బిగ్ బాస్ టైటిల్ నెగ్గలేదు గానీ ఆడియన్స్ మనసులో చోటు సంపాదించాడు. ఇంతకు ముందు హీరోగా ఒక ట్రెండు చిన్న సినిమాలు చేశాడు. ఆయా సినిమాలో అంతగా ఆడలేదు. దాంతో ఇప్పుడు అతని కొత్త సినిమాకు కాంట్రవర్షియల్ టైటిల్ ఫిక్స్ చేశారు. అది కూడా కులాల పేర్లు కలిసి వచ్చేలా టైటిల్ పెట్టారు.
చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి!Chowdary Gari Abbayitho Naidu Gari Ammayi Movie: అమర్ దీప్ చౌదరి కథానాయకుడిగా రూపొందుతున్న కొత్త సినిమా టైటిల్ 'చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి'. కథకు, టైటిల్‌కు అసలు సంబంధం లేదని స్వయంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల తెలిపారు. మరి, ఆ టైటిల్ ఎందుకు పెట్టారు?అంటే.. ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం అని అంటున్నారు.
'చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి' సినిమాతో ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రీతా నాయుడు (Supritha Naidu) కథానాయకగా పరిచయం అవుతున్నారు. అమర్ దీప్ చౌదరిలోని చౌదరి, సుప్రీతా నాయుడులోని నాయుడు తీసుకొని సినిమాకు టైటిల్ పెట్టారు.
Also Read: వదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ
మల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న 'చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి' సినిమాను ఎం3 మీడియా పతాకం మీద మహేంద్రనాథ్ కూండ్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంతకు ముందు వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో 'శబరి' సినిమా ప్రొడ్యూస్ చేశారు ఆయన. లేటెస్ట్ సినిమా టైటిల్ గురించి మహేంద్ర నాథ్ మాట్లాడుతూ... ''ప్రస్తుతం సినిమా విజయంలో టైటిల్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మేము ఏదో ఒక టైటిల్ పెట్టి పోస్టర్లు వేస్తే జనాలకు రెండు రోజులు కూడా గుర్తుండదు. సాధారణంగా కధకు సూట్ అయ్యే టైటిల్ పెట్టాలని అంటారు. నేను అలా చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా టైటిల్ పెట్టాలని మా దర్శకుడు నేను డిస్కస్ చేసుకుని ఈ టైటిల్ పెట్టాం. కథకు సూట్ అయ్యే టైటిల్ కాదని మా దర్శకుడు చెప్పినప్పటికీ... కథకు రిలేటెడ్ టైటిల్ అయితే 100 రోజులు ఆడుతుందా? అని ప్రశ్నించా. ప్రేక్షకులకు నచ్చితే సినిమా ఆడుతుంది లేదంటే లేదు. సినిమాలో మంచి విషయం ఉంది'' అని అన్నారు.
Also Read: వయలెంట్ యాక్షన్ ఫిల్మ్ తీసిన దర్శకుడితో శ్రీకాంత్ కుమారుడు... రోషన్ హీరోగా లవ్ స్టోరీ!